ఒకరి కోసం కప్పు గెలవడమేంటి? వరల్డ్‌ కప్‌ ఎందుకు గెలవాలంటే..: ద్రవిడ్‌

Rahul Dravid, T20 World Cup 2024: తన కోసం టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలవాలని కోరుకుంటున్న వారికి రాహుల్‌ ద్రవిడ్‌ ఊహించని షాకిచ్చాడు. అసలు వరల్డ్‌ కప్‌ ఎందుకు గెలవాలో కూడా చాలా గొప్పగా చెప్పాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Rahul Dravid, T20 World Cup 2024: తన కోసం టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలవాలని కోరుకుంటున్న వారికి రాహుల్‌ ద్రవిడ్‌ ఊహించని షాకిచ్చాడు. అసలు వరల్డ్‌ కప్‌ ఎందుకు గెలవాలో కూడా చాలా గొప్పగా చెప్పాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఫైనల్‌ మ్యాచ్‌కు టీమిండియా రెడీగా ఉంది. తుది పోరులో సౌతాఫ్రికాను కూడా మట్టి కరిపించి.. కప్పును ఎత్తాలని రోహిత్‌ సేన పట్టుదలతో ఉంది. 2022లో టీ20 వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో, 2023 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఎదురైన ఫలితాన్ని రిపీట్‌ కానివ్వకుండా ఈ సారి కప్పుతోనే తిరిగి రావాలని జట్టులోని ప్రతి ఆటగాడు కసిగా ఉన్నాడు. అయితే.. 2011 వన్డే వరల్డ్‌ కప్‌ను సచిన్‌కు ట్రిబ్యూట్‌గా గెలిచినట్లు.. ఈ టీ20 వరల్డ్‌ కప్‌ 2024ను కూడా టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కోసం గెలవాలని క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు.

అందుకోసం సోషల్‌ మీడియా వేదికగా ‘డూ ఇట్‌ ఫర్‌ ద్రవిడ్‌’ అనే క్యాంపెయిన్‌ కూడా రన్‌ చేస్తున్నారు. ఆటగాడిగా.. టీమిండియా తరఫున వన్డే వరల్డ్‌ కప్‌ గెలవలేకపోయిన రాహుల్‌ ద్రవిడ్‌.. కనీసం కోచ్‌గానైనా ఆ లోటును తీర్చుకోవాలని భావిస్తున్నాడు. 2023లో ఒక్క మ్యాచ్‌తో వరల్డ్‌ కప్‌ మిస్‌ అయింది. ఈ సారి అలా జరగకుండా చూసుకుంటున్నాడు. అయితే.. హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌కు ఈ ఫైనల్‌ మ్యాచ్‌ చివరిది కావడంతో అతని కోసమైనా కప్పు గెలవాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. టీమిండియా కప్పు గెలిచి.. ద్రవిడ్‌కు గిఫ్ట్‌గా ఇవ్వాలని భారత మాజీ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ కూడా టీమిండియాను కోరాడు.

కానీ, రాహుల్‌ ద్రవిడ్‌ వాళ్లందరికీ షాకిస్తూ.. అసలు ఒకరి కోసం కప్పు గెలవడం ఏంటి అంటూ ప్రశ్నించాడు. ఏ ఒక్కరి కోసమే కప్పు గెలవడం అనేది తన సిద్ధాంతానికి వ్యతిరేకంగా అని, దాన్ని నేను ఒప్పుకొనని కుండబద్ధలు కొట్టేశాడు. తన కోసం ‘డూ ఇట్‌ ఫర్‌ ద్రవిడ్‌’ అని క్యాంపెయిన్‌ జరుగుతున్న విషయంపై స్పందించిన ద్రవిడ్‌ పై విధంగా స్పందించాడు. మౌంట్‌ ఎవరెస్ట్‌ ఎందుకు ఎక్కుతున్నావ్‌ అంటూ ఎవరెస్ట్‌ ఉంది కాబట్టి ఎక్కుతున్నాను.. అలాగే వరల్డ్‌ కప్‌ ఎందుకు గెలవాలంటే.. వరల్డ్‌ కప్‌ ఉంది కాబట్టి గెలవాలి అంటే కానీ, ఏ ఒక్కరి కోసమో గెలవాలి అని అనుకోవడం సరికాదంటూ ద్రవిడ్‌ తన హంబుల్‌నెస్‌ను మరోసారి చూపించాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments