2007 వరల్డ్‌ కప్‌ డిజాస్టర్‌పై ద్రవిడ్‌ ఎమోషనల్ రియాక్షన్‌!

రాహుల్‌ ద్రవిడ్‌.. ప్రస్తుతం టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఉన్నారు. అయితే.. అంతకంటే ముందు ఆయన ఓ దిగ్గజ క్రికెటర్‌. భారత క్రికెట్‌లో గొప్ప ప్లేయర్‌ పేరొంది.. క్రికెట్‌ ప్రపంచంలో లెజెండరీ క్రికెటర్‌గా ఉన్నారు. అయితే.. టీమిండియాలో ఆటగాడిగానే కాక, కెప్టెన్‌గా కూడా ద్రవిడ్‌ తన సేవలను అందించాడు. ద్రవిడ్‌ కెప్టెన్సీలోనే టీమిండియా 2007 వన్డే వరల్డ్‌ కప్‌లో పాల్గొంది. కానీ, ఆ వరల్డ్‌ కప్‌ భారత్‌కు ఓ పీడకల అనే చెప్పాలి. ఎందుకంటే.. అంతకంటే ముందు 2003 వరల్డ్‌ కప్‌లో ఫైనల్స్‌ వరకు వెళ్లిన టీమిండియా భారీ అంచనాల నడుమ వరల్డ్ కప్‌ 2007లో బరిలోకి దిగిన భారత్‌.. అ‍త్యంత దారుణంగా లీగ్‌ దశలోనే ఇంటికి వచ్చింది.

బంగ్లాదేశ్‌, శ్రీలంక లాంటి దేశాలపై పరాజయం పాలై.. టోర్నీ లీగ్‌ దశలో నిష్క్రమించి క్రికెట్‌ అభిమానులను దారుణంగా నిరాశపర్చింది. ఆ వరల్డ్‌ కప్‌ గురించి తాజాగా టీమిండియా హెడ్‌ కోచ్‌, అప్పటి టీమిండియా కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్పందిస్తూ..  ఆ వరల్డ్‌ కప్‌ జరిగి చాలా కాలం అయిపోయింది. ఆ సంఘటనను అప్పుడే మర్చిపోయానని, నిజానికి ప్రస్తుతం తానో క్రికెట్‌ ప్లేయర్‌ విషయం కూడా తనకిప్పుడు గుర్తులేదని అన్నాడు. టీమిండియా హెడ్‌ కోచ్‌గా.. జట్టును ముందుకు నడిపించేందుకు ఈ వరల్డ్‌ కప్‌లో టీమిండియా సహాయపడటం గురించే తాను ఆలోచిస్తున్నట్లు ద్రవిడ్‌ చెప్పుకోచ్చాడు. టీమ్‌ కెప్టెన్‌ ఆలోచనను మద్దుతనిస్తూ.. బౌండరీ లైన్‌ బయట వారికి తమ సహాయం అందిస్తామని అన్నాడు.

ఎందుకు మ్యాచ్‌లో బరిలోకి దిగి ఆడాల్సింది ఆటగాళ్లే. సపోర్టింగ్‌ స్టాఫ్‌గా ఉన్న తాము ఒక్క సింగిల్‌ రన్‌కానీ, ఒక వికెట్‌ కానీ తీయలేం కదా అని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. కాగా ఈ వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా భారత్‌ తమ తొలి మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధం అవుతుంది. ఆదివారం చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కి ముందు జరిగిన ప్రెస్‌ మీట్‌లో ద్రవిడ్‌ పై విధంగా వ్యాఖ్యలు చేశారు. అయితే.. గొప్ప క్రికెటర్‌గా ఉన్న ద్రవిడ్‌ ఖాతాలో వరల్డ్‌ కప్‌ మాత్రం లేదు. ఆటగాడిగా వరల్డ్‌ కప్‌ ముద్దాడలేకపోయిన ద్రవిడ్‌.. కనీసం కోచ్‌గా అయినా వరల్డ్‌ కప్‌ ఎత్తాలని క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ద్రవిడ్‌ 2007 వరల్డ్‌ కప్‌ గురించి స్పందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రచిన్ బ్యాటింగ్​ను మెచ్చుకున్న ద్రవిడ్.. అతడిలో అది ఎక్కువంటూ..!

Show comments