వీడియో: బాధలో ఉన్న భారత క్రికెటర్లను ఓదార్చిన మోదీ! ఎమోషనల్‌ మూమెంట్‌

  • Author Soma Sekhar Published - 11:53 AM, Tue - 21 November 23

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. ఓటమి బాధతో డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న టీమిండియా క్రికెటర్లను ఓదార్చారు ప్రధాని మోదీ. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. ఓటమి బాధతో డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న టీమిండియా క్రికెటర్లను ఓదార్చారు ప్రధాని మోదీ. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Author Soma Sekhar Published - 11:53 AM, Tue - 21 November 23

నవంబర్ 19.. టీమిండియా క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ.. ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ కప్ ను ఎగరేసుకుపోయింది. ఈ ఓటమి బాధ నుంచి టీమిండియా ప్లేయర్లు, అభిమానులు ఇంకా బయటపడలేకపోతున్నారు. ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న క్రికెట్ లవర్స్ తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇక మ్యాచ్ అనంతరం గ్రౌండ్ లోనే భారత ప్లేయర్లు కళ్లు చెమర్చిన వీడియోలు నెట్టింట వైరల్ గా మరిన విషయం మనకు తెలియనిది కాదు. ఇదిలా ఉండగా.. ఓటమి బాధతో డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న టీమిండియా క్రికెటర్లను ఓదార్చారు ప్రధాని మోదీ. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోవడంతో.. మైదానంలో కన్నీటి పర్యంతం అయ్యారు ఆటగాళ్లు. కెప్టెన్ రోహిత్ శర్మ అయితే ఉబికివస్తున్న కన్నీటిని దిగమింగుతూ.. గ్రౌండ్ నుంచి బయటకి వెళ్తున్న వీడియో ఇప్పటికీ మన కంటిముందు కదులుతూనే ఉంది. మరోవైపు చిన్నపిల్లాడిలా సిరాజ్ ఏడుపు కూడా అందరికీ గుర్తే. ఇక మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో విషాదకర దృశ్యాలే మెదిలాయి. ఇలాంటి సమయంలో భారత ప్రధాన నరేంద్ర మోదీ వచ్చి.. బాధలో ఉన్న టీమిండియా ఆటగాళ్లను ఓదార్చాడు.

ముందుగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల చేతులు పట్టుకుని వారికి ధైర్యం చెప్పాడు. బాధపడాల్సిన పనిలేదు.. మరింత దృఢంగా తయ్యారు అయ్యి ముందుకు సాగుదాం అని వారితో చెప్పారు మోదీ. ఆ తర్వాత కోచ్ రాహుల్ ద్రవిడ్ తో పాటుగా ఒక్కో ఆటగాడిని పలకరిస్తూ.. వారిని ఓదార్చాడు. భావోద్వేగానికి గురైన షమీని కౌగిలించుకుని మరీ ధైర్యం చెప్పాడు మోదీ. డ్రెస్సింగ్ రూమ్ లో ప్రధాని ఉన్నంతసేపు ఎమోషనల్ వాతావరణం నెలకొంది. ఇలాంటి కష్టాలు వస్తుంటాయని, వాటిని దీటుగా ఎదుర్కొని ముందుకు సాగడమే నిజమైన వీరుల లక్షణమని చెబుతూ.. ఆటగాళ్లను ఉత్తేజపరిచారు ప్రధాని. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Show comments