Rohit Sharma: రోహిత్‌ శర్మను పచ్చి బూతులు తిట్టారు! ఆ గొడవ బయటపెట్టిన మాజీ క్రికెటర్‌

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మను కొంతమంది పచ్చి బూతులు తిట్టిన విషయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్‌ తాజాగా బయటపెట్టాడు. అయితే.. దానికి రోహిత్‌, తాను ఎలా రియాక్ట్‌ అయ్యారో కూడా వెల్లడించాడు. ఆ గొడవేంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మను కొంతమంది పచ్చి బూతులు తిట్టిన విషయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్‌ తాజాగా బయటపెట్టాడు. అయితే.. దానికి రోహిత్‌, తాను ఎలా రియాక్ట్‌ అయ్యారో కూడా వెల్లడించాడు. ఆ గొడవేంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా.. అతన్ని చూసేందుకు, అతని ఆటోగ్రాఫ్‌, ఫొటోగ్రాఫ్‌ ల కోసం అభిమానులు ఎగబడుతుంటారు. అయితే.. ఇదంతా రోహిత్‌ ఒక స్టార్‌ క్రికెటర్‌ గా ఎదిగిన తర్వాత జరుగుతున్నవి. కానీ, రోహిత్‌ కెరీర్‌ స్టార్టింగ్‌ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. జట్టులో ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు ఉండడో తెలియదు. టాలెంట్‌ కు కొదవలేకపోయినా.. నిలకడగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం రోహిత్‌ శర్మ ప్లేస్‌ ను టీమ్‌ లో సుస్థిరం చేయలేకపోయింది. ఇదే సమయంలో ఒకసారి రోహిత్‌ శర్మ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాడు.

మన ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులే రోహిత్‌ శర్మను పచ్చి బూతులు తిట్టారు. ఆ విషయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్‌ ప్రవీణ్‌ కుమార్‌ తాజాగా వెల్లడించాడు. ఆ గొడవ సమయంలో ప్రవీణ్‌ కుమార్‌ రోహిత్‌ శర్మకు మద్దతుగా నిలిచాడు. అకారణంగా రోహిత్‌ శర్మపై బూతులతో రెచ్చి పోతున్న వారిపై వికెట్‌ తీసుకుని గొడవకు వెళ్లాడు ప్రవీణ్‌ కుమార్‌. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ.. అసలు ఆ రోజు ఏం జరిగిందో పూర్తి వివరాలు వెల్లడించాడు. ఆస్ట్రేలియాలో ఆ ఘటన జరిగినట్లు తెలిపాడు. ప్రాక్టీస్‌ సమయంలో.. తాను బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తానని, తనకు బౌలింగ్‌ వేయాలని రోహిత్‌ ప్రవీణ్‌ ను కోరినట్లు పేర్కొన్నాడు.

ఇద్దరూ కలిసి నెట్స్‌ లో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో.. అక్కడికి వచ్చిన భారత క్రికెట్‌ అభిమానులు.. రోహిత్‌ ను కామెంట్‌ చేయడం ప్రారంభించారని, బూతులు కూడా తిట్టారని.. చాలా సేపు ఓపిక పట్టిన రోహిత్‌ శర్మ సహనం కోల్పోయి వారితో గొడవకు దిగాడని ప్రవీణ్‌ పేర్కొన్నాడు. ఆ సమయంలో తాను కూడా రోహిత్‌ కు మద్దతుగా వారికి వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలిపాడు. నెట్స్‌ నుంచి బయటికి వెళ్లడానికి ప్రయత్నించానని కానీ కుదరలేదని తెలిపాడు. స్టంప్‌ పట్టుకుని దాంతో కొడతానని కూడా ప్రవీణ్‌ వారికి గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. ఆ వీడియాను ఇప్పటికే క్రికెట్‌ అభిమానులు చూసి ఉంటారు. అప్పటికీ ఇంకా రోహిత్‌ శర్మ అంత పెద్ద ప్లేయర్‌ కాదు. టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాంటి తరుణంలో ఒక యంగ్‌ ప్లేయర్‌ కు ప్రవీణ్‌ కుమార్‌ మద్దతుగా నిలిచి.. ఫ్యాన్స్‌ తో గొడవకు దిగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments