SNP
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌తో టీమిండియా యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ సాంప్రదాయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే.. తన తొలి మ్యాచ్ ప్రసిద్ధ్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. అది ఎలానో.. ఇప్పుడు చూద్దాం..
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌తో టీమిండియా యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ సాంప్రదాయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే.. తన తొలి మ్యాచ్ ప్రసిద్ధ్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. అది ఎలానో.. ఇప్పుడు చూద్దాం..
SNP
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా దారుణమైన ఓటమిని చవిచూసింది. ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమి పాలై.. అందరికి షాక్‌కి గురిచేసింది. తొలి ఇన్నింగ్స్ 245 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో మరీ ఘోరంగా 131 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ సెంచరీతో రాణించగా, రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 76 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ మినహా మిగతా జట్టు మొత్తం ఈ టెస్ట్ మ్యాచ్‌లో దారుణంగా విఫలమైంది. మ్యాచ్ ఓటమి సంగతి అటుంచితే.. పాపం ఈ మ్యాచ్‌తో టెస్టు క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అరంగేట్రం మ్యాచ్‌తో చెత్త బౌలర్‌గా గుర్తింపు పొందిన వారి జాబితాలో ఏకంగా రెండో స్థానంలో నిలిచాడు.
టీమిండియా తరఫున ఇప్పటి వరకు చాలా మంది బౌలర్లు టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ, తొలి మ్యాచ్ ఎవరికైనా ప్రత్యేకమే. దాన్ని కెరీర్ ఆసాంతం గుర్తుంచుకునేలా మంచి ప్రదర్శనతో ఆకట్టుకోవాలని అనుకుంటారు. కానీ, కొన్ని సార్లు వారి ఆశలు ఆడియాశలుగా మారిపోయాతాయి. తొలి మ్యాచ్‌లోనే భారీగా పరుగులు సమర్పించుకుని.. అదో చేదు అనుభవంగా మిగుల్చుకుంటారు. ఇప్పుడు యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకు అలాంటి పరిస్థితే ఎదురైంది. పాపం.. డెబ్యూ చేసిన తొలి టెస్టులోనే భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. సౌతాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొత్తం 20 ఓవర్లు బౌలింగ్ వేసిన ప్రసిద్ధ్.. ఏకంగా 93 పరుగులు సమర్పించుకున్నాడు. కేవలం ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు.
అయితే.. టెస్ట్ క్రికెట్‌లోకి డెబ్యూ చేస్తూ భారీగా పరుగులిచ్చుకున్న బౌలర్ల జాబితాలో ప్రసిద్ధ్ కృష్ణ రెండో స్థానంలో నిలిచాడు. టీమిండియా మాజీ క్రికెటర్ తిరుమలై శేఖర్ చెత్త రికార్డును ప్రసిద్ధ్ కృష్ణ అధిగమించాడు. 1983లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన శేఖర్ ఏకంగా 86 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. అయితే.. ఇప్పుడు ఆ రికార్డును ప్రసిద్ధ్ అధిగమించి రెండో స్థానాన్ని ఆక్రమించాడు. మరి నంబర్ ప్లేస్‌లో ఏ బౌలర్ ఉన్నాడా? అని ఆలోచిస్తున్నారా? ఆ బౌలర్ ఎవరో తెలిస్తే మీరే షాక్ అవుతారు. టెస్ట్ క్రికెట్‌లో తొలి బంతికే వికెట్ తీయడమే కాదు.. ఏకంగా టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన దిగ్గజ బౌలర్.. తన తొలి టెస్ట్ మ్యాచ్‌లో మాత్రం చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయ్యాడు. ఆ స్టార్ బౌలర్ ఎవరో కాదు.. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.
2003లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌తో మ్యాచ్‌తో సాంప్రదాయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పఠాన్.. తొలి మ్యాచ్‌లో ఏకంగా 136 పరుగులు సమర్పించుకుని.. అత్యంత చెత్త డెబ్యూ బౌలర్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో పఠాన్‌కే కేవలం ఒక్క వికెట్ మాత్రమే దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో 27 ఓవర్లు వేసి 136 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో పర్వాలేదనిపించాడు. 7 ఓవర్లలో కేవలం 24 రన్స్ మాత్రమే ఇచ్చాడు. కానీ, తొలి మ్యాచ్‌లో చేదు అనుభవం ఎదురైనా.. దిగ్గజ బౌలర్‌గా, అద్భుతమైన ఆల్‌రౌండర్‌గా పఠాన్ ఎదిగాడు. ఇప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ సైతం పఠాన్‌ను స్ఫూర్తిగా తీసుకుని.. తొలి మ్యాచ్ చేదు అనుభవాన్ని మర్చిపోయి.. వేగంగా కమ్‌బ్యాక్ ఇచ్చి, గొప్ప బౌలర్‌గా ఎదగాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.