వీడియో: ఇంగ్లండ్‌కు వాళ్ల దేశంలోనే స్పిన్‌ మజా చూపిస్తున్న జయసూర్య!

Prabath Jayasuriya, Harry Brook, Chris Woakes, ENG vs SL: శ్రీలంక స్పిన్నర్‌ ప్రబాత్‌ జయసూర్య.. తన సూపర్‌ స్పిన్‌తో ఇంగ్లండ్‌కు అసలు సిసలైన స్పిన్‌ మజా ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Prabath Jayasuriya, Harry Brook, Chris Woakes, ENG vs SL: శ్రీలంక స్పిన్నర్‌ ప్రబాత్‌ జయసూర్య.. తన సూపర్‌ స్పిన్‌తో ఇంగ్లండ్‌కు అసలు సిసలైన స్పిన్‌ మజా ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికాతో పాటు ఇంగ్లండ్‌ పిచ్‌లు కూడా స్పీడ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. అందుకే ఆయా దేశాల క్రికెటర్లు స్పీడ్‌ బౌలింగ్‌ను అద్భుతంగా ఎదుర్కొంటూ.. స్పిన్‌ బౌలింగ్‌కు తడబడుతుంటారు. అదే వాళ్ల బలహీనత. ఉపఖండపు దేశాలైన ఇండియా, పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లు స్పిన్‌ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొవడమే కాదు.. బౌలింగ్‌లో కూడా మంచి స్పిన్‌ ఎటాక్‌ను కలిగి ఉంటాయి. తాజాగా ఇంగ్లండ్‌తో మూడు టెస్టులు ఆడేందుకు వెళ్లిన శ్రీలంక జట్టు.. ఇంగ్లండ్‌కు వాళ్ల సొంత గడ్డపైనే స్పిన్‌ మజా ఏంటో చూపిస్తోంది.

లంక స్పిన్నర్‌ ప్రబాత్‌ జయసూర్య తన స్పిన్‌ మ్యాజిక్‌తో ఇ‍ద్దరు బ్యాటర్లను పెవిలియన్‌కు చేర్చాడు. ఇప్పటి వరకు తీసింది రెండు వికెట్లే అయినా.. ఆ రెండు బంతులు వేసిన విధానం, బాల్‌ టర్న్‌ అయిన తీరు.. అద్భుతమే చెప్పాలి. అవుట్‌ అయిన తర్వాత.. ఇంగ్లండ్‌ బ్యాటర్లు హ్యారీ బ్రూక్‌, క్రిస్‌ ఓక్స్‌ ఇచ్చిన షాకింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ చూస్తే.. ఆ బాల్స్‌ గొప్పతనం ఏంటో తెలిసిపోతుంది. ఇంగ్లండ్‌ బౌలర్లు తమకు పేస్‌ రుచి చేపిస్తే.. శ్రీలంక బౌలర్లు స్పిన్‌ మజా ఎలా ఉంటుందో ఇంగ్లండ్‌కు చూపిస్తున్నారు. ప్రబాత్‌ జయసూర్య వేసిన ఆ రెండు బాల్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో.. ఇన్నింగ్స్‌ 40వ ఓవర్‌ తొలి బంతికి 56 పరుగులతో బాగా ఆడుతున్న హ్యారీ బ్రూక్‌కు దిమ్మతిరిగే బాల్‌ వేశాడు జయసూర్య, అలాగే ఇన్నింగ్స్‌ 58వ ఓవర్‌ మూడో బంతికి క్రిస్‌ ఓక్స్‌ను సైతం మ్యాజికల్‌ డెలవరీతో పెవిలియన్‌ చేర్చాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఆ తర్వాత.. తొలి ఇన్నింగ్స్‌కు దిగిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసి.. 23 రన్స్‌ లీడ్‌లో ఉంది. వికెట్‌ కీపర్‌ స్మిత్‌(72 నాటౌట్‌), గుస్ అట్కిన్సన్(4 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నారు. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో 3, ప్రభాత్‌ జయసూర్య 2, విశ్వా ఫెర్నాండో ఒక వికెట్‌ తీసుకున్నారు. మరి ఈ మ్యాచ్‌లో ప్రబాత్‌ జయసూర్య స్పిన్‌ బౌలింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments