ఇక నుంచి నా లక్ష్యం ఒక్కటే.. ఇండియాకు వ్యతిరేకంగా ఆడాలి: భారత మాజీ క్రికెటర్‌

Unmukt Chand: ఇండియాలో పుట్టి, ఇండియాలో పెరిగి.. ఇక్కడి అండర్‌ 19కి కెప్టెన్‌గా చేసి.. వరల్డ్‌ కప్‌ కూడా గెలిచిన ఆటగాడు.. ఇప్పుడు ఇండియాకి వ్యతిరేకంగా ఆడటమే తన లక్ష్యం అంటున్నాడు. విషయం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

Unmukt Chand: ఇండియాలో పుట్టి, ఇండియాలో పెరిగి.. ఇక్కడి అండర్‌ 19కి కెప్టెన్‌గా చేసి.. వరల్డ్‌ కప్‌ కూడా గెలిచిన ఆటగాడు.. ఇప్పుడు ఇండియాకి వ్యతిరేకంగా ఆడటమే తన లక్ష్యం అంటున్నాడు. విషయం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

భారత దేశానికి వ్యతిరేకండా ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నానని ఓ భారత మాజీ క్రికెటర్‌ సంచలన ప్రకటన చేశాడు. ఆ క్రికెటర్‌ ఇండియాకు అండర్‌-19 వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌. కానీ, ఆ క్రికెటరే ఇండియాకు వ్యతిరేకంగా టీ20 వరల్డ్‌ కప్‌ 2024 బరిలోకి దిగనున్నాడు. ఆ క్రికెటర్‌ మరెవరో కాదు.. ఉన్ముక్త్‌ చంద్‌. 2012 అండర్‌19 వరల్డ్‌ కప్‌ గెలిచిన కెప్టెన్‌ ఉన్ముక్త్‌ చంద్‌ పేరు భారత క్రికెట్‌లో మారుమోగిపోయింది. కానీ, ఆ తర్వాత అతను ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో టీమిండియాలో స్థానం దక్కలేదు. అయితే.. ఉన్ముక్త్‌ చంద్‌ ప్రస్తుతం అమెరికాకు తరఫున ఆడేందుకు సిద్ధం అవుతున్నాడు.

కొన్నేళ​ క్రితం అమెరికాకు వెళ్లిపోయినా ఉన్ముక్త్‌ చంద్‌ అక్కడి దేశవాళీ క్రికెట్‌లో ఆడాడు. రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో పాల్గొనేందుకు అతనికి అమెరికా జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ సందర్భంగా చంద్‌ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతను మాట్లాడుతూ.. ‘భార‌త క్రికెట్ నుంచి వైదొలిగాక‌.. భార‌త జ‌ట్టుకు ప్ర‌త్య‌ర్థిగా ఆడడ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నా. అలాగ‌ని నాకు ఇండియాపై కోపం లేదు. ప్ర‌పంచంలోని బెస్ట్‌ టీమ్‌పై నా స‌త్తా నిరూపించుకోవాల‌నేది నా ఉద్దేశం’ అని పేర్కొన్నాడు.

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా జూన్ 12న న్యూయార్క్‌లోని నాసౌ కౌంటీ స్టేడియంలో టీమిండియాతో అమెరికా జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది. ఈ మెగా టోర్నీ వెస్టిండీస్‌-అమెరికా సంయుక్త వేదికగా జరగనుంది. అయితే.. వన్డే వరల్డ్‌ కప్‌ 2023ను కేవలం ఒక్క మ్యాచ్‌ ఓటమితో కోల్పోయిన టీమిండియా.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024ను మాత్రం కచ్చితంగా గెలిచి తీరాలని భావిస్తోంది. అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు మొదలుపెట్టింది. పైగా జట్టులోని సీనియర్‌ స్టార్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ టీ20 వరల్డ్‌ కప్‌ ఆడతారనే విషయం కూడా స్పష్టమైంది. మరి పటిష్టమైన టీమిండియాకు వ్యతిరేకంగా ఆడి.. ఉన్ముక్త్‌ చంద్‌ ఏమేర సక్సెస్‌ అవుతాడో చూడాలి. భారత్‌కు వ్యతిరేకంగా ఆడటమే లక్ష్యమని ఉన్ముక్త్‌ చంద్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments