SNP
PCB, Pakistan Cricket, T20 World Cup 2024: వరల్డ్ కప్ ఆడేందుకు అమెరికా వెళ్లిన పాకిస్థాన్ క్రికెట్ టీమ్ సైడ్ బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై పాక్ మాజీ క్రికెటర్ కూడా విమర్శించారు. మరి ఆ సైడ్ బిజినెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
PCB, Pakistan Cricket, T20 World Cup 2024: వరల్డ్ కప్ ఆడేందుకు అమెరికా వెళ్లిన పాకిస్థాన్ క్రికెట్ టీమ్ సైడ్ బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై పాక్ మాజీ క్రికెటర్ కూడా విమర్శించారు. మరి ఆ సైడ్ బిజినెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024 కోసం అమెరికా వెళ్లిన పాకిస్థాన్ క్రికెటర్లు చిల్లరు పనులు చేస్తూ పరువు తీసుకుంటున్నారు. వరల్డ్ కప్‌లో తమ తొలి మ్యాచ్ ఆడకుండానే ఒక వివాదంలో చిక్కుకుంది పాకిస్థాన్ జట్టు. అమెరికాలో ప్రైవేట్ పార్టీలు నిర్వహిస్తూ.. పాకిస్థాన్ క్రికెట్ అభిమానుల నుంచి డబ్బులు దండుకుంటున్నారే విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈ విషయంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతిఫ్.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై దుమ్మేత్తి పోశారు. అసలు ఇలాంటి పనులు ఎవరైనా చేస్తారా? అంటూ మండిపడ్డారు. ఇంతకీ పాక్ క్రికెటర్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం..
అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభమైన విషయం తెలిసిందే. కొన్ని మ్యాచ్‌లు వెస్టిండీస్‌లో, కొన్ని మ్యాచ్‌లు అమెరికాలో జరుగుతున్నాయి. ఈ వరల్డ్ కప్ కోసం ఇంగ్లండ్ నుంచి అమెరికా వచ్చింది పాకిస్థాన్ టీమ్. వరల్డ్ కప్ కంటే ముందు ఇంగ్లండ్‌తో నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడిన పాక్.. 0-2తో ఓడిపోయి.. వరల్డ్ కప్ కోసం అమెరికా గడ్డపై అడుగుపెట్టింది. అయితే.. పాక్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 6న అమెరికాతో ఆడనుంది. అయితే.. ఈ లోపు అమెరికాలోని పాకిస్థాన్ క్రికెట్ అభిమానులతో పాక్ క్రికెట్ టీమ్‌కు ప్రైవేట్ డిన్నర్ పార్టీలు ప్లాన్ చేసింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.
అయితే.. ఈ డిన్నర్‌కు హాజరు కావాలంటే పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు 25 అమెరికా డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అభిమానులు నుంచి ఇలా డబ్బులు వసూలు చేసి.. ప్రైవేట్ డిన్నర్లు ఏర్పాటు చేయడం ఏంటంటూ.. లతీఫ్ ప్రశ్నిస్తున్నారు. క్రికెటర్లను 25 డాలర్ల కోసం అమ్మకానికి పెడతారా? అంటూ మండిపడుతున్నారు. డిన్నర్ పార్టీలు నిర్వహించాలనుకుంటే.. అధికారికంగా ఏర్పాటు చేయాలని, ఇలా అభిమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ప్రైవేట్ పార్టీలు నిర్వహించడం అవమానకరం అని అన్నారు. ఈ సంస్కృతికి పాక్ క్రికెటర్లు బాగా అలవాటు పడ్డారని, ఏ కార్యక్రమానికి పిలిచినా.. ఎంత డబ్బు ఇస్తారని అడుగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Pakistan bashed for hosting USD 25 private dinner to meet fans in USA during t20 world cup 2024 pic.twitter.com/78Ff5Y2ok0
— Sayyad Nag Pasha (@nag_pasha) June 5, 2024
Let’s Save The Star & Be Stars
Unofficial Private Dinner During WC24#T20WorldCup pic.twitter.com/BXEgPyA2p2— Rashid Latif | 🇵🇰 (@iRashidLatif68) June 4, 2024