Harmanpreet Singh: భారత్​కు హాకీలో మెడల్.. శ్రీజేష్​ను పొగుడుతున్నారు! కానీ రియల్ హీరో హర్మన్​ప్రీతే!

ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ మరో పతకం ఒడిసిపట్టింది. హాకీలో బ్రాంజ్ మెడల్​తో సత్తా చాటింది ఇండియా. అయితే ఇందుకు లెజెండ్ పీఆర్ శ్రీజేష్​తో పాటు మరో ఆటగాడికి కూడా క్రెడిట్ ఇవ్వాలి.

ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ మరో పతకం ఒడిసిపట్టింది. హాకీలో బ్రాంజ్ మెడల్​తో సత్తా చాటింది ఇండియా. అయితే ఇందుకు లెజెండ్ పీఆర్ శ్రీజేష్​తో పాటు మరో ఆటగాడికి కూడా క్రెడిట్ ఇవ్వాలి.

ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ మరో పతకం ఒడిసిపట్టింది. హాకీలో బ్రాంజ్ మెడల్​తో సత్తా చాటింది ఇండియా. స్పెయిన్​తో ఇవాళ జరిగిన కాంస్య పతక పోరులో 2-1 తేడాతో విజయం సాధించింది. ఈ మెడల్​తో పారిస్ ఒలింపిక్స్​లో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. ఫస్ట్ క్వార్టర్స్​లో రెండు టీమ్స్ గోల్ చేయలేకపోయాయి. సెకండ్ క్వార్టర్స్ స్టార్టింగ్​లో స్పెయిన్ ప్లేయర్ మార్క్ మిరల్లెస్ పెనాల్టీ స్ట్రోక్​ను గోల్​గా మార్చాడు. దీంతో ఆ టీమ్ లీడింగ్​లోకి వెళ్లింది. అయితే ఆ తర్వాత లభించిన పెనాల్టీ కార్నర్​ను భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. వెంటనే ఇంకో పెనాల్టీ కార్నర్ దొరకగా.. కెప్టెన్ హర్మన్​ప్రీత్ సింగ్ ఎలాంటి పొరపాటు లేకుండా గోల్ పోస్ట్​లోకి పంపడంతో స్కోరు 1-1తో సమమైంది.

థర్డ్ క్వార్టర్ మొదలైన కాసేపటికే మరో పెనాల్టీ కార్నర్​తో హర్మన్​ప్రీత్ ఇంకో గోల్ చేశాడు. దీంతో భారత్ 2-1తో లీడింగ్​లోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత కూడా మూడు పెనాల్టీ కార్నర్​లు సాధించినా.. వాటిని గోల్స్​గా మలచలేకపోయింది మన టీమ్. ఆఖర్లో మరో నిమిషంలో గేమ్ ముగుస్తుందనగా.. స్పెయిన్​కు పెనాల్టీ కార్నర్ దొరికింది. అయితే లెజెండరీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ దాన్ని అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా స్కోరును సమం చేయలేకపోయింది స్పెయిన్. గత ఒలింపిక్స్​లోనూ బ్రాంజ్ మెడల్ నెగ్గిన భారత్.. మరోమారు కంచుమోత మోగించింది. దీంతో కోట్లాది మంది అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. అయితే ఈ విజయానికి చాలా మంది శ్రీజేష్​ను మాత్రమే పొగుతున్నారు. అసలు హీరో హర్మన్​ప్రీత్​ను మర్చిపోతున్నారు.

గోల్​కీపర్ శ్రీజేష్​ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్, 336 మ్యాచులు ఆడిన అనుభవం, 2 కామన్​వెల్త్ గేమ్స్ మెడల్స్, 3 ఏషియా గేమ్స్ మెడల్స్ సాధించిన అతడికి ఇది రెండో ఒలింపిక్ మెడల్. అతడికి ఘనంగా వీడ్కోలు పలకాలనే పట్టుదలతో టీమ్ అంతా కష్టపడ్డారు. శ్రీజేష్​ కూడా అడ్డుగోడలా నిలిచి ప్రత్యర్థులు గోల్ కొట్టకుండా అడ్డుకున్నాడు. అయితే హాకీ జట్టు సక్సెస్​లో కెప్టెన్ హర్మన్​ప్రీత్​కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఈ ఒలింపిక్స్​లో ఏకంగా 10 గోల్స్ కొట్టాడతను. ఇవాళ్టి మ్యాచ్​లో భారత్ కొట్టిన రెండు గోల్స్​ కూడా అతడి స్టిక్ నుంచి వచ్చినవే. కెప్టెన్​గా టోర్నీ ఆసాంతం టీమ్​ను అద్భుతంగా నడిపిన హర్మన్.. దాదాపుగా ప్రతి మ్యాచ్​లోనూ గోల్ కొడుతూ వచ్చాడు. అతడి పోరాటపటిమ, నాయకత్వానికి సెల్యూట్ కొట్టాల్సిందే. హాకీ ప్రపంచంలో భారత్​ పేరు మరోమారు మార్మోగేలా చేసిన ఈ ఛాంపియన్​ ఆటగాడు, రియల్ హీరోను ఎంత మెచ్చుకున్నా తక్కువే.

Show comments