T20 World Cup: పరువు గంగపాలు.. అమెరికా చేతిలో చిత్తుగా ఓడిన పాక్

T20 World Cup: పరువు గంగపాలు.. అమెరికా చేతిలో చిత్తుగా ఓడిన పాక్

గత కొన్ని రోజుల క్రితం ఐపీలఎల్ సందడి ముగిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు క్రికెట్ ప్రియులకు టీ20 ప్రపంచకప్ ఫుల్ జోష్ నింపుతోంది. అమెరికాతో జరిగిన మ్యాచ్ లో పాక్ చిత్తుగా ఓడింది.

గత కొన్ని రోజుల క్రితం ఐపీలఎల్ సందడి ముగిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు క్రికెట్ ప్రియులకు టీ20 ప్రపంచకప్ ఫుల్ జోష్ నింపుతోంది. అమెరికాతో జరిగిన మ్యాచ్ లో పాక్ చిత్తుగా ఓడింది.

అగ్రరాజ్యం అమెరికాలో టి20 వరల్డ్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో సంచలన విజయాలు నమోదవుతున్నాయి. ఊహకందని రీతిలో చిన్న జట్లు పెద్ద జట్లకు షాకులిస్తూ కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. పెద్ద జట్లకు గట్టి పోటీనిస్తూ చిన్న టీమ్స్ ఔరా అనిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ లో సంచలన విజయం నమోదైంది. టీ20 వరల్డ్ కప్ కు ఆతిథ్యమిస్తున్న అమెరికా జట్టు, పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో పాక్, యూఎస్ఏ జట్ల స్కోర్లు సమం అయ్యాయి. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్ ఓవర్ లో అమెరికా పాక్ ను చిత్తుగా ఓడించి చారిత్రాత్మక విజయాన్నందుకుంది.

ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న యూఎస్ఏ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ లో రాణిస్తూ ప్రత్యర్థి జట్టు పాక్ కు చుక్కలు చూపించింది. యూఎస్, పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బాబర్‌ ఆజమ్‌ 44 (43 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షాదాబ్‌ ఖాన్‌ 40 (25 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్స్‌లు) పరుగులు సాధించారు. షాహిన్‌ అఫ్రిది 23 (16 బంతుల్లో 23 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో జట్టుకు మంచి స్కోర్ అందించారు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన అమెరికా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించింది. కెప్టెన్ మోనాంక్‌ పటేల్‌ 50 (38 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్‌), ఆరోన్‌ జోన్స్‌ 36 (26 బంతుల్లో 36 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), గూస్‌ 35 (26 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్‌) పరుగులతో మెరిశారు.

అయితే చివరి ఓవర్‌లో అమెరికా విక్టరీకి 15 పరుగులు అవసరం కాగా.. మొదటి ఐదు బంతుల్లో 4 సింగిల్స్‌, ఓ సిక్స్‌ వచ్చాయి. చివరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా.. నితీశ్ ఫోర్ బాదడంతో స్కోర్లు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా వికెట్‌ నష్టానికి 18 పరుగులు చేసింది. 19 పరుగుల లక్ష్యఛేదనలో పాక్‌ వికెట్ నష్టపోయి 13 పరుగులకు పరిమితమై అమెరికా చేతిలో ఓటమినిచవిచూసింది. ఈ విజయంతో గ్రూప్‌-ఏలో వరుసగా రెండు విజయాలు సాధించిన అమెరికా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. సూపర్ ఓవర్ లో నేత్రవల్కర్‌ అద్భుతమైన బౌలింగ్ అమెరికాను విజయతీరాలకు చేర్చడంలో కీలకంగా మారింది.

Show comments