Virat Kohli: విరాట్‌ కోహ్లీకి ఘోర అవమానం! కోపంతో రగిలిపోతున్న ఫ్యాన్స్‌

ఒక్క టీమిండియాకే కాదు.. మొత్తం వరల్డ్‌ క్రికెట్‌కు ఫేస్‌ లాంటి లెజెండరీ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి ఘోర అవమానం జరిగిందని అతని ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్‌ అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి అవమానం ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఒక్క టీమిండియాకే కాదు.. మొత్తం వరల్డ్‌ క్రికెట్‌కు ఫేస్‌ లాంటి లెజెండరీ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి ఘోర అవమానం జరిగిందని అతని ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్‌ అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి అవమానం ఏంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఎలాంటి ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్‌ మొదలుపెట్టినప్పటి నుంచి తిరుగులేని క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. ఎన్నో గొప్ప గొప్ప ఇన్నింగ్స్‌లతో ఇప్పటికే లెజెండ్‌ హోదాను కూడా పొందేశాడు. ప్రపంచ క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ దేవుడైతే.. సచిన్‌ తర్వాత సచిన్‌ అంతటోడు విరాట్‌ కోహ్లీనే. ఇప్పటికే సచిన్‌ నెలకొల్పిన ఎన్నో అద్భుతమైన రికార్డులను కోహ్లీ బద్దలు కొట్టాడు. సచిన్‌ వంద సెంచరీల రికార్డును అందుకోవడమే టార్గెట్‌గా కోహ్లీ పరుగులు పెడుతున్నాడు. ఇప్పటికే 80 సెంచరీలు చేసి.. సచిన్‌ రికార్డుకు చేరువయ్యాడు. వన్డేలు, టెస్టుల్లో కోహ్లీ కింగులాంటి ప్లేయర్‌. అలాంటి ఆటగాడిని తాజాగా స్టార్‌ స్పోర్ట్స్‌ ఘోరంగా అవమానించింది. దీంతో విరాట్‌ కోహ్లీ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం స్టార్‌ స్పోర్ట్స్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇంతకీ స్టార్‌ స్పోర్ట్స్‌ ఏం చేసిందంటే.. ఈ ఏడాది టెస్ట్‌ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో కూడిన ఇయర్‌ ఆఫ్‌ ది టెస్ట్‌ టీమ్‌ను ప్రకటించింది. అందులో విరాట్‌ కోహ్లీకి చోటు దక్కలేదు. ఇది క్రికెట్‌ అభిమానులతో పాటు, మాజీ క్రికెటర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. స్టార్‌ స్పోర్ట్స్‌ ప్రకటించిన టెస్ట్‌ టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌లో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ, స్పిన్‌ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌.. ఈ టీమ్‌లో ఉన్నారు. కానీ, మిడిల్డార్‌లో టీమిండియాకు వెన్నుముకలా ఉన్న విరాట్‌ కోహ్లీకి మాత్రం టీమ్‌లో చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఈ విషయంపై క్రికెట్‌ అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు. 2023లో విరాట్‌ కోహ్లీకి టెస్టుల్లో 55 సగటు ఉందని.. అలాంటి ఆటగాడు ఇయర్‌ ఆఫ్‌ ది టీమ్‌లో లేకపోవడం ఏంటనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్‌, ప్రస్తుతం కామెంటేటర్‌గా చేస్తున్న ఇర్ఫాన్‌ పఠాన్‌ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది టెస్టుల్లో 55 బ్యాటింగ్‌ యావరేజ్‌ ఉన్న కోహ్లీకి ఇయర్‌ ఆఫ్‌ ది టీమ్‌లో చోటు దక్కకపోవడం షాకింగ్‌గా ఉందన్నాడు. అయితే.. ఈ ఇయర్‌ ఆఫ్‌ ది టీమ్‌ను స్టార్‌స్పోర్ట్స్‌ ఎక్స్‌పర్ట్స్‌ రూపొందించారా? లేకా ప్రేక్షకుల ఓటింగ్‌తో రూపొందించారా? అనే విషయం తెలియాల్సి ఉంది. మరి స్టార్‌ స్పోర్ట్స్‌ ప్రకటించిన ఇయర్‌ ఆఫ్‌ ది టెస్ట్‌ టీమ్‌లో కోహ్లీకి చోటు దక్కకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

స్టార్‌ స్పోర్ట్స్‌ టెస్ట్‌ టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌: ఉస్మాన్‌ ఖవాజా, రోహిత్‌ శర్మ, జో రూట్‌, కేన్ విలియమ్సన్‌, ట్రావిస్‌ హెడ్‌, జానీ బెయిర్‌స్టో, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, మిచెల్‌ స్టార్క్‌, ప్యాట్‌ కమిన్స్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌.

Show comments