PAK vs BAN: పాకిస్థాన్‌ను గడగడలాడించిన బంగ్లాదేశ్‌ బ్యాటర్‌ ముష్ఫికర్ రహీమ్!

Mushfiqur Rahim, PAK vs BAN: పాకిస్థాన్‌ టీమ్‌ గర్వాన్ని అణిచివేస్తూ.. బంగ్లాదేశ్‌ బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ ఇన్నింగ్స్‌ ప్రత్యేకత ఏంటి? ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Mushfiqur Rahim, PAK vs BAN: పాకిస్థాన్‌ టీమ్‌ గర్వాన్ని అణిచివేస్తూ.. బంగ్లాదేశ్‌ బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ ఇన్నింగ్స్‌ ప్రత్యేకత ఏంటి? ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రావాల్పిండి వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ బ్యాటర్‌ ముష్ఫికర్ రహీమ్ సంచలన ‍బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. పాకిస్థాన్‌పై తన తొలి టెస్ట్‌ సెంచరీ నమోదు చూస్తూ.. అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో రహీమ్‌ ఆడిన ఇన్నింగ్స్‌తో.. పాకిస్థాన్‌ గర్వాన్ని అణిచివేశాడు. 22 ఫోర్లు, ఒక సిక్స్‌తో 191 పరుగులు చేసి.. కొద్దిలో డబుల్‌ సెంచరీ మిస్‌ అయినా.. పాకిస్థాన్‌ బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగించాడు. అతని బ్యాటింగ్‌ టాలెంట్‌ ముందు.. షాహీన్‌ షా అఫ్రిదీ, నసీమ్‌ షా, ఖుర్రమ్‌ షహజాద్‌, మొహమ్మద్‌ అలీ, అఘా సల్మాన్‌తో కూడిన బౌలింగ్‌ ఎటాక్‌ చిన్నబోయింది.

పైగా.. బంగ్లాదేశ్‌కు 448 పరుగులు టార్గెట్‌ సరిపోతుందిలే అని.. ఓవర్‌ కాన్పిడెన్స్‌తో 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన పాకిస్థాన్‌కు సరైన విధంగా బుద్ధి చెప్పాడు ముష్ఫికర్ రహీమ్. పాక్‌ బౌలర్లను విసిగిస్తూ.. వికెట్‌ ఇవ్వకుండా దాదాపు 57 ఓవర్లు ఒక్కడే ఎదుర్కొన్నాడు. మొత్తంగా 341 బంతులు ఎదుర్కొని.. 22 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 191 పరుగులు చేసి.. చివరికి మొహమ్మద్‌ అలీ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. అతనితో పాటు.. బంగ్లాదేశ్‌ ఓపెనర్లు ఇస్తామ్‌ 93, మొమినుల్‌ 50, లిట్టన్‌ దాస్‌ 56, మొహదీ హసన్‌ 71(నాటౌట్‌) రాణించడంతో బంగ్లాదేశ్‌ 164 ఓవర్లు ముగిసే సరికి 541 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

అంతకంటే ముందు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ 113 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ ఇచ్చింది. ఓపెనర్‌ సైమ్‌ అయ్యూబ్‌ 56, సౌద్‌ షకీల్‌ 141, రిజ్వాన్‌ 171(నాటౌట్‌) రాణించారు. బంగ్లాదేశ్‌ను రెండు సార్లు ఆలౌట్‌ చేయడానికి 448 పరుగుల స్కోర్‌ సరిపోతుందని పాకిస్థాన్‌ భావించింది. పైగా రిజ్వాన్‌ 171 పరుగులు చేసి అద్బుతంగా ఆడుతున్న సమయంలో.. అతన్ని డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకోనివ్వకుండా అడ్డుపడి.. ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. కానీ వారి ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ను ముష్ఫికర్‌ రహీమ్‌ పటాపంచెలు చూస్తూ.. సంచలన ఇన్నింగ్స్‌తో బంగ్లాదేశ్‌ను సూపర్‌ స్ట్రాంగ్‌ పొజిషన్‌లో నిలిపాడు. రహీమ్‌ ఆట చూపి.. పొట్టోడైనా గట్టొడే అంటూ క్రికెట్‌ అభిమానులు అభినందిస్తున్నారు. అలాగే ముష్ఫికర్‌ను బంగ్లాదేశ్‌ సచిన్‌ అంటూ బంగ్లా అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారనే విషయం తెలిసిందే. మరి ఈ మ్యాచ్‌లో రహీమ్‌ 191 పరుగుల ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments