SNP
Mohammed Siraj, IND vs SL: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌కు సిద్ధం అవుతున్న టీమిండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. శ్రీలంక మొగుడు గాయంతో తొలి మ్యాచ్‌కు దూరం అయ్యాడని తెలుస్తోంది. అతనెవరో? ఎలా గాయమైందో ఇప్పుడు చూద్దాం..
Mohammed Siraj, IND vs SL: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌కు సిద్ధం అవుతున్న టీమిండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. శ్రీలంక మొగుడు గాయంతో తొలి మ్యాచ్‌కు దూరం అయ్యాడని తెలుస్తోంది. అతనెవరో? ఎలా గాయమైందో ఇప్పుడు చూద్దాం..
SNP
టీ20 వరల్డ్ కప్ తర్వాత.. టీమిండియా ఒక పటిష్టమైన ప్రత్యర్థిని ఢీకొనబోతుంది. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నెల 27 నుంచి టీ20 ప్రారంభం కానుంది. అయితే.. తొలి టీ20 మ్యాచ్ ప్రారంభానికి ముందే.. టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. స్టార్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రాక్టీస్ సమయంలో గాయమైనట్లు వార్తలు వస్తున్నాయి. ప్రాక్టీస్ సెషన్‌లో సిరాజ్ కాలికి గాయమైనట్లు సమాచారం. ఆ గాయం కారణంగా సిరాజ్ తొలి టీ20కి దూరం అవుతాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ తర్వాత.. టీమిండియాకు పేస్ బౌలింగ్‌లో పెద్ద దిక్కుగా ఉన్న సిరాజ్ గాయంతో దూరమైతే.. టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే. పైగా శ్రీలంకపై సిరాజ్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. సిరాజ్ పేరు చెప్పగానే చాలా మందికి శ్రీలంక జట్టే గుర్తుకు వస్తుంది. టీ20 వరల్డ్ కప్ 2024లో సిరాజ్‌ను ఎందుకు ఎంపిక చేశారంటే.. శ్రీలంకతో మ్యాచ్ కోసం అంటూ జోకులు కూడా పేలాయి. శ్రీలంక కోటాలో సిరాజ్ ఎంపికయ్యాడంటూ క్రికెట్ అభిమానులు సరదాగా పేర్కొన్నారు. గతేడాది జరిగిన ఆసియా కప్ 2023లో శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో సిరాజ్ అద్భుతమైన బౌలింగ్‌తో చెలరేగి.. లంకను కుప్పకూల్చాడు.
ఆ మ్యాచ్‌లో సిరాజ్ ఒకే ఓవర్‌లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 7 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అందుకే శ్రీలంకకు సిరాజ్‌ను సరైనోడు అంటూ ఉంటారు క్రికెట్ అభిమానులు. అలాంటి బౌలర్ సిరీస్ ఆరంభానికి ముందే గాయపడటంతో.. భారత క్రికెట్ అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు. ఒక వేళ నిజంగానే సిరాజ్ తొలి టీ20కి దూరమైతే.. ఖలీల్ అహ్మద్, అర్షదీప్ సింగ్ భారత పేస్ భారాన్ని మోయాల్సి ఉంటుంది. మరి సిరాజ్ గాయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
M siraj got Injured during practice session🤕😢#ShubmanGill #INDvsSL #SLvIND pic.twitter.com/dIxtM18a6R
— Hashim Butt (@Hashim41659037) July 25, 2024