SNP
వరల్డ్ కపలో బ్యాటర్ల పని పడుతున్న షమీ.. సోషల్ మీడియాలో చెత్త వాడుడు వాగుతున్న వారి పనికూడా పడుతున్నాడు. తాజా ఓ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ నోటికొచ్చి మాటలు మాట్లాడటంపై స్పందిస్తూ.. గట్టి కౌంటర్ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
వరల్డ్ కపలో బ్యాటర్ల పని పడుతున్న షమీ.. సోషల్ మీడియాలో చెత్త వాడుడు వాగుతున్న వారి పనికూడా పడుతున్నాడు. తాజా ఓ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ నోటికొచ్చి మాటలు మాట్లాడటంపై స్పందిస్తూ.. గట్టి కౌంటర్ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
వరల్డ్ కప్‌లో టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీ సూపర్ ఫామ్‌లో దూసుకెళ్తున్నాడు. తొలి నాలుగు మ్యాచ్‌లు ఆడకపోయినా.. జట్టులోకి వచ్చాకా.. ఇంతకాలం తనను ఎలా బయటపెడతారంటూ చెప్పకనే చెప్పాడు. ఈ వరల్డ్ కప్‌లో వేసిన తొలి బంతికే వికెట్ తీసిన షమీ మొత్తం ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసి అన్‌స్టాపబుల్‌గా ఉన్నాడు. షమీతో పాటు టీమిండియా పేసర్లు సిరాజ్, బుమ్రా కూడా అదరగొడుతుండటంతో.. భారత పేస్ దళం నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. ప్రస్తుతం టీమిండియా పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొనే జట్టు కనిపించడం లేదు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా లాంటి హేమాహేమా జట్లు కూడా మన పేస్ ముందు నిలువలేకపోయాయి.
దీంతో.. టీమిండియా పేస్ బౌలింగ్‌పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. కానీ, మన దాయాది దేశం పాకిస్థాన్ మాత్రం మన బౌలింగ్‌పై ఏడ్చి చచ్చోస్తోంది. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా ఓ టీవీ డిబేట్‌లో పాల్గొంటూ.. టీమిండియాకు వేరే బాల్స్ ఇస్తున్నారని, అందుకే ఎవరికీ స్వింగ్ లభించని పిచ్‌లపై కూడా వాళ్లకు స్వింగ్ లభిస్తోందని అర్థంలేని ఆరోపణలు చేశాడు. దానికి పాకిస్థాన్ దిగ్గజ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఎందుకు ఇలాంటి అర్థంలేని వ్యాఖ్యలు చేసి మీ పరువు తీసుకోవడంతో పాటు మా పరువు కూడా తీస్తారంటూ మండిపడ్డారు. అయినా కూడా వారిలో మార్పులేదు.
తమ వ్యాఖ్యలు ఇంకా సమర్ధించుకుంటున్నారు. దీంతో ఏకంగా టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీనే రంగంలోకి దిగాడు. సోషల్ మీడియా వేదికగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్‌ను కడిగిపారేశాడు. ఇలాంటి మాటల మాట్లాడుతున్నందుకు సిగ్గపడాలని, మీరు కూడా మాజీ క్రికెటరే కదా.. మీ దేశ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ అంత మంచిగా చెప్పినా మీకు బుర్రకు ఎక్కలేదా? మీ దేశస్థుడిని కూడా మీరు నమ్మరా అంటూ మండిపడ్డాడు. అలాగే తమ సక్సెస్ చూసి పాకిస్థాన్‌లో కొంతమంది మండిపోతున్నారని, ఓర్వలేకపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరి షమీ కౌంటర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Hahhaha thanks bhai love you ❤️ bhai ye log alag duniya k loge hai ye log dusre ka success se jalte hai or apna ko chupane k liye ye harkate kar rahe hai bus ye to wahin hai just like a wow 😀😀😀😀 @Umeshnni https://t.co/FiExj6Oq1F
— 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) November 8, 2023
Mohammed Shami giving reply to Pakistani experts. pic.twitter.com/xwgsY31rU9
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 8, 2023