Mohammed Shami: షమీ రెండో పెళ్లి చేసుకున్నాడా? వైరల్ అవుతున్న వార్తలో నిజమెంత?

వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైనా.. టోర్నీ మొత్తం జట్టు ఆడిన తీరుకు ప్రశంసలు దక్కాయి. అందులో షమీ పాత్ర ఎంతో ఉంది. అయితే.. షమీ రిసెంట్‌గా రెండో పెళ్లి చేసుకున్నాడనే విషయం వార్తలు వస్తున్నాయి. అవి ఎంత వరకు నిజమో ఇప్పుడు చూద్దాం..

వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైనా.. టోర్నీ మొత్తం జట్టు ఆడిన తీరుకు ప్రశంసలు దక్కాయి. అందులో షమీ పాత్ర ఎంతో ఉంది. అయితే.. షమీ రిసెంట్‌గా రెండో పెళ్లి చేసుకున్నాడనే విషయం వార్తలు వస్తున్నాయి. అవి ఎంత వరకు నిజమో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ మొహమ్మద్‌ షమీ రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో అద్భుత ప్రదర్శనతో అందరి ప్రశంసలు అందుకున్న షమీ.. ఆ తర్వాత గాయంతో జట్టుకు దూరం అయ్యాడు. ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లకు కూడా అందుబాటులో లేడు. అంతకు ముందు వరల్డ్‌ కప్‌లో కూడా షమీ గాయంతో ఇబ్బంది పడుతూనే.. దేశం కోసం ప్రాణం పెట్టి ఆడాడు. మొత్తంగా కేవలం 7 మ్యాచ్‌లే ఆడినప్పటికీ 24 వికెట్లు పడగొట్టి.. వరల్డ్‌ కప్‌ టోర్నీలోనే టాప్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. అయితే.. షమీ క్రికెట్‌ కెరీర్‌ ఉచ్ఛస్థితిలో ఉన్నప్పటికీ.. వ్యక్తిగత జీవితం మాత్రం వివాదాల్లో మునిగిపోయింది.

షమీ మాజీ భార్య హసీన్‌ జహాన్‌ షమీపై తీవ్ర ఆరోపణలు చూసి.. విడాకుల కోసం కోర్టుకు ఎక్కిన విషయం తెలిసిందే. ఆ సమయంలో షమీ ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నాడు. తీవ్ర మానసిక వేదనకు గురైన షమీ.. మళ్లీ క్రికెట్‌పై ఫోకస్‌ పెట్టి సక్సెస్‌ అయ్యాడు. అయితే.. తాజాగా షమీ రెండో పెళ్లి చేసుకున్నాడన్న వార్త ఒకటి సోషల్‌ మీడియాతో పాటు మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలోనూ వచ్చింది. మొదటి భార్య టార్చర్‌ నుంచి విముక్తిపొందిన షమీ.. ప్రశాంతంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక నుంచైనా షమీ జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాం అంటూ చాలా మంది నెటిజన్లు సైతం.. షమీ తలపాగ, దండతో ఉన్న ఒక ఫొటోను తెగషేర్‌ చేస్తున్నారు.

అయితే.. అది షమీ రెండో పెళ్లి ఫొటో కాదు. ఏదో కార్యక్రమంలో షమీని అతని స్నేహితులు స్వాగతం పలుకుతూ ఆ విధంగా సత్కరించారు. ఈ ఫొటోలను షమీనే స్వయంగా తన సోషల్‌ మీడియాలో అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. అయితే.. గతంలోనే షమీ రెండో పెళ్లిపై స్పందించాడు. తనకు మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని, అసలు తన జీవితంలో జరిగిన దారుణాలు చూస్తే.. నాకు మరో అమ్మాయిపై నమ్మకం రాదని స్పష్టం చేశాడు. ఎంతో బాధతో షమీ చెప్పిన ఆ వీడియో అప్పట్లో బాగా వైరల్‌ అయింది. వ్యక్తిగత జీవితంలో ఎన్ని కష్టాల్లో బాధలు ఉన్నా.. దేశంలో మైదానంలోకి దిగితే మాత్రం షమీ తన వంద శాతం ఎఫర్ట్‌ ఇచ్చేవాడు. అందుకే షమీని చాలా మంది అభిమానిస్తారు. మరి షమీ రెండో పెళ్లి వార్త ఫేక్‌ అని తేలడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments