Zaheer Khan: లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్ గా జహీర్ ఖాన్? పక్కా ప్లాన్ తోనే..

Zaheer Khan: లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్ గా జహీర్ ఖాన్? పక్కా ప్లాన్ తోనే..

లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్ గా టీమిండియా దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్ ను తీసుకునే ఆలోచన ఉందట. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్ గా టీమిండియా దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్ ను తీసుకునే ఆలోచన ఉందట. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

IPL 2025 కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ ప్రణాళికలను రచించుకుంటున్నాయి. ఏ ప్లేయర్లను తీసుకోవాలి? ఎవరిని వేలంలోకి వదలాలి అన్న ప్లాన్స్ లో మేనేజ్ మెంట్స్ తలమునకలై ఉన్నాయి. దాంతో పాటుగా మెంటర్లుగా అనుభవం ఉన్న దిగ్గజ ఆటగాళ్ల కొరకు వెతుకులాటలు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే క్రికెట్ వర్గాల్లో ఓ న్యూస్ వైరల్ గా మారింది. లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్ గా టీమిండియా దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్ ను తీసుకునే ఆలోచన ఉందట. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 2025పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఇక ఈ టోర్నీకి సంబంధించిన విధివిధానాలను రూపొందించే పనిలో పడింది బీసీసీఐ. మరోవైపు ఫ్రాంచైజీలు సైతం జట్టు కూర్పుపై దృష్టి పెట్టాయి. అందులో భాగంగా మెంటర్లను కోచ్ లను నియమించుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ తమ టీమ్ కు మెంటర్ గా టీమిండియా బౌలింగ్ దిగ్గజం జహీర్ ఖాన్ నియమించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో గౌతమ్ గంభీర్ ప్లేస్ ను జహీర్ ద్వారా రీప్లేస్ చేయాలనుకుంటోంది. ఇంతకు ముందు ఉన్న బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ప్రస్తుతం టీమిండియాకు బౌలింగ్ కోచ్ గా వచ్చాడు. ఇక గంభీర్ హెడ్ కోచ్ గా ఉన్న విషయం తెలియనిది కాదు.

ఈ నేపథ్యంలో జహీర్ ను మెంటర్ గా నియమించుకుని అతడి బౌలింగ్ అనుభవాన్ని కూడా ఉపయోగించుకోవాలని లక్నో మేనేజ్ మెంట్ ఆలోచన. ఇందుకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ లో ఎంతో అనుభవం ఉన్న జహీర్ ను పక్కా ప్లాన్ తోనే లక్నో మెంటర్ గా నియమించుకోవాలనుకుంటోంది. తద్వారా ఈసారైనా టైటిల్ ను ఎగరేసుకుపోవాలనుకుంటోంది. మరి లక్నో మెంటర్ గా జహీర్ వస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments