SNP
SNP
అమెరికాలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ 2023లో చెత్త రికార్డు నమోదైంది. ఆదివారం లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్-ఎంఐ న్యూయార్క్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మొత్తం 17 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో చెత్త ప్రదర్శనతో ఘోర ఓటమి చవిచూసిన నైట్‌రైడర్స్ అయితే మరీ దారుణంగా 50 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ టీమ్‌లో ఏకంగా 10 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితం అయ్యారు. మార్టిన్ గప్టిల్, రోలీ రోసోవ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ లాంటి హేమాహేమీలున్న జట్టు కేవలం 50 పరుగులకే ఆలౌట్ కావడం క్రికెట్ అభిమానులను షాక్‌కు గురిచేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాల్డ్ బ్రెవిస్ 7 బంతుల్లో 15 పరుగులు చేసి ఊపుమీద కనిపించినా ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టి డ్రై బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మిగతా బ్యాటర్లు సైతం పెద్ద ఆడలేదు. కెప్టెన్ పొలార్డ్ సైతం 5 పరుగులకే వెనుదిరిగి నిరాశపర్చాడు. అయితే నికోలస్ పూరన్ 38, టిమ్ డేవిడ్ 48 పరుగులతో రాణించడంతో ఎంఐ ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. ముఖ్యంగా టిమ్ డేవిడ్ చివర్లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 48 పరుగులు చేసి దుమ్మురేపాడు.
ఇక 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ కేవలం 50 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ ఉన్ముక్త్ చంద్ ఒక్కడే 26 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్‌కే అవుట్ అయ్యి దారుణంగా నిరాశపరిచారు. ఓపెనర్ మార్టిన్ గప్టిల్, నితీష్ కుమార్, డ్రై, ఫెర్గూసన్ ఖాతా తెరవకుండానే వికెట్ సమర్పించుకున్నారు. రోసోవ్, రస్సెల్, నరైన్ ఉన్నా కూడా పరుగులు చేయలేకపోయారు. ఎంఐ బౌలర్లలో తలో రెండు వికెట్లతో నైట్‌రైడర్స్‌ను చావుదెబ్బ కొట్టారు. అంతకు ముందు టెక్సాస్ సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ నైట్‌రైడర్స్ ఓటమి పాలైంది. మరి ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ దారుణ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
50 ALL OUT 😱
Los Angeles Knight Riders handed a huge defeat by MI New York in MLC https://t.co/3GUR1Op9OC #MLC2023 pic.twitter.com/56kBbzhlJJ
— ESPNcricinfo (@ESPNcricinfo) July 17, 2023
ఇదీ చదవండి: తండ్రికి ఫోన్ చేసి కన్నీటిపర్యంతమైన జైస్వాల్