SNP
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా పైచేయి సాధించేందుకు పోరాటం చేస్తోంది. భారీ స్కోర్‌తో రెండో రోజు ఇండియాను భయపెట్టిన బెన్ డకట్.. మూడో రోజు చాలా విచిత్రంగా అవుట్ అయ్యాడు. అతని అవుట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా పైచేయి సాధించేందుకు పోరాటం చేస్తోంది. భారీ స్కోర్‌తో రెండో రోజు ఇండియాను భయపెట్టిన బెన్ డకట్.. మూడో రోజు చాలా విచిత్రంగా అవుట్ అయ్యాడు. అతని అవుట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
SNP
రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ హోరాహోరీగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీలతో రాణించారు. డెబ్యూ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సైతం 62 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్ మంచి స్టార్ట్ అందుకుంది. ముఖ్యంగా ఓపెనర్ బెన్ డకెట్ సెంచరీతో కదం తొక్కాడు. టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. చాలా స్వేచ్ఛగా షాట్లు ఆడాడు. దీంతో ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసి రెండో రోజు ఆటను ముగించింది. తిరిగి మూడో రోజు కొనసాగించిన ఇంగ్లండ్ కుల్దీప్ ఊహించని షాకిచ్చాడు.
ముఖ్యంగా బెన్ డకెట్ అవుట్ గురించి మాట్లాడుకోవాలి. రెండో రోజు టీమిండియా బౌలింగ్ ఎటాక్‌ను పూర్తిగా డామినేట్ చేసిన డకెట్.. మూడో రోజు ఆటలో కూడా అదే టెంపర్‌మెంట్‌ను చూపించాడు. కానీ, అతను అవుటైన తీరు మాత్రం అస్సలు నమ్మశక్యంగా లేదు. అతన్ని అవుట్ చేయడానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పెట్టని ఫీల్డింగ్ లేదు, ప్రయోగించని బౌలర్ లేడు. అయినా కూడా బెన్ టీమిండియాకు అస్సలు దొరకలేదు. అప్పటికే 150 పరుగులు పూర్తి చేసుకుని.. భారీ ఇన్నింగ్స్ లక్ష్యంగా దూసుకెళ్తున్న బెన్ డకెట్‌ను కుల్దీప్ యాదవ్ ఒక చెత్త బాల్‌తో అవుట్ చేశాడు. నిజానికి ఆ బాల్‌కు వికెట్ కాదు కదా.. బ్యాటర్ ఏ మాత్రం ఇబ్బంది కూడా పడాల్సిన అవసరం లేని డెలవరీ అది. అసలైతే ఆ బాల్‌ను ఏ బ్యాటర్ అయినా బౌండరీకి తరలించి చెత్త బాల్ వేసినందుకు బౌలర్‌కు బుద్ధి చెబుతాడు.
కానీ, బెన్ డకెట్ అంత సేపు అద్భుతంగా ఆడి.. ఒక చెత్త డెలవరీకి తన వికెట్‌ను టీమిండియాకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ బాల్‌కు అతను అవుట్ అవుతాడని బహుషా కుల్దీప్ యాదవ్ కూడా ఊహించి ఉండడు. కానీ, బెన్ ఆ బాల్‌కే అవుట్ అయి అందరిని షాక్‌కి గురిచేశాడు. షార్ట్ అండ్ ఆఫ్‌సైడ్ వైడ్‌గా వేసిన బాల్‌ను బెన్ డకెట్ వెంటాడి మరీ ఆడాడు. కుల్దీప్ వేసిందే చెత్త బాల్ అనుకుంటే.. అంతకంటే చెత్త షాట్ ఆడి డకెట్ అవుట్ అయ్యాడు. కుల్దీప్ వేసిన ఇన్నింగ్స్ 51వ ఓవర్ తొలి బంతిని షార్ట్ అండ్ ఆఫ్‌సైడ్ వైడ్‌గా వేశాడు. దాన్ని వెంటాడి మరి ఆడిన డకెట్.. కవర్స్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్ చేతుల్లోకి సింపుల్ క్యాచ్‌ను ఇచ్చాడు. ఊహించని విధంగా వచ్చిన ఈ వికెట్‌తో కుల్దీప్ ఫుల్ ఖుష్ అయిపోయాడు. ఇతన్ని ఎలా అవుట్ చేయాలనిరా భగవంతుడా అని రోహిత్ తలపట్టుకుంటున్న తరుణంలో కుల్దీప్ ఒక చెత్త బాల్‌తో అవుట్ చేసి.. డకెట్ దండయాత్రకు ముగింపు పలికాడు. మరి డకెట్ అవుట్‌కు సంబంధించిన వీడియో కింద ఉంది.. చూసి ఆ అవుట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Kuldeep Yadav spins his magic and brings an end to Ben Duckett’s innings! 👌#INDvsENG #KuldeepYadav #TeamIndia pic.twitter.com/0gxbTHxjNR
— OneCricket (@OneCricketApp) February 17, 2024