6 నెలల గ్యాప్‌ తర్వాత కూడా అల్లాడించిన రాహుల్‌! భర్త సెంచరీపై అతియా ఎమోషనల్‌!

  • Author singhj Published - 03:45 PM, Tue - 12 September 23
  • Author singhj Published - 03:45 PM, Tue - 12 September 23
6 నెలల గ్యాప్‌ తర్వాత కూడా అల్లాడించిన రాహుల్‌! భర్త సెంచరీపై అతియా ఎమోషనల్‌!

ఆటగాళ్లు గాయాలపాలవ్వడం అనేది సహజమే. ఇది క్రికెట్​లోనూ జరుగుతూనే ఉంటుంది. ఫీల్డింగ్ లేదా బౌలింగ్ చేస్తున్నప్పుడు లేదా వికెట్ల మధ్య పరుగులు తీస్తున్నప్పుడు క్రికెటర్లు గాయాల పాలవ్వడం చూస్తూనే ఉంటాం. కొందరు ప్లేయర్లు మ్యాచ్​ల్లో కాకుండా ప్రాక్టీస్ సెషన్స్​లో గాయాల బారిన పడి దూరమైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇంజ్యురీ నుంచి ఎంత త్వరగా కోలుకుంటారు, కమ్​బ్యాక్​లో ఎలా ఆడతారనేదే చాలా కీలకం. గాయం తర్వాత ఆటగాళ్లు మునుపటి లయను కోల్పోవడం, అంతకుముందులా ఆడని సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కొందరు ప్లేయర్లు మాత్రం గాయం నుంచి కోలుకొని సూపర్బ్​గా కమ్​బ్యాక్ ఇస్తారు.

భారత స్టార్ వికెట్ కీపర్/బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా అదిరిపోయే రేంజ్​లో రీఎంట్రీ ఇచ్చాడు. గాయం కారణంగా ఆరు నెలలు భారత జట్టుకు దూరంగా ఉన్నాడు రాహుల్. ఆసియా కప్-2023లో భాగంగా పాకిస్థాన్​తో సూపర్-4 మ్యాచ్​లో ఈ బ్యాటర్ కమ్​బ్యాక్ ఇచ్చాడు. పునరాగమనంలో ఆడిన తొలి మ్యాచ్​లోనే అద్భుతమైన సెంచరీతో తానేంటో మరోమారు నిరూపించుకున్నాడు. ఒక్క ఇన్నింగ్స్​తో తన ఫామ్, ఫిట్​నెస్​పై ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చాటి చెప్పాడు. బలమైన పాక్ బౌలింగ్​ అటాక్​ను ఎదుర్కొంటూ సుదీర్ఘ సమయం ఏ తడబాటూ లేకుండా బ్యాటింగ్ చేశాడు.

పాకిస్థాన్​తో మ్యాచ్​లో చక్కటి స్ట్రోక్ ప్లేతో కేఎల్ రాహుల్ మెప్పించాడు. ఈ ఇన్నింగ్స్​ ద్వారా బలహీనంగా కనిపిస్తున్న మిడిలార్డర్​కు కూడా భరోసానిచ్చాడు. బ్యాటింగ్​తో పాటు పాక్ ఇన్నింగ్స్​లో వికెట్ కీపింగ్ కూడా చేసి ఆకట్టుకున్నాడు. కమ్​బ్యాక్​లో సెంచరీతో అదరగొట్టిన రాహుల్​పై అతడి భార్య అతియా శెట్టి ప్రశంసల జల్లులు కురిపించింది. భర్త సెంచరీపై ఆమె ఎమోషనల్ అయ్యింది. ‘ఎంత అగాథమైన చీకటైనా సూర్యుడు ఉదయించగానే ముగుస్తుంది. మీరే నాకు సర్వస్వం’ అని సోషల్ మీడియాలో అతియో ఓ పోస్టు పెట్టింది. ఈ పోస్టుపై భారత క్రికెట్ ఫ్యాన్స్​తో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. రాహుల్ ఇన్నింగ్స్​ను మెచ్చుకుంటున్నారు.

ఇదీ చదవండి: శ్రీలంకతో మ్యాచ్​.. భారత ప్లేయింగ్ 11లో మార్పులు?

Show comments