iDreamPost

Asia Cup: నేడు శ్రీలంకతో మ్యాచ్‌! టీమిండియా ప్లేయింగ్‌ 11లో మార్పులు?

  • Published Sep 12, 2023 | 12:00 PMUpdated Sep 12, 2023 | 12:00 PM
  • Published Sep 12, 2023 | 12:00 PMUpdated Sep 12, 2023 | 12:00 PM
Asia Cup: నేడు శ్రీలంకతో మ్యాచ్‌! టీమిండియా ప్లేయింగ్‌ 11లో మార్పులు?

ఆసియా కప్‌ 2023లో భాగంగా సూపర్‌ దశలో టీమిండియా తమ రెండో మ్యాచ్‌ ఆడనుంది. ఆది-సోమవారాల్లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ 228 పరుగుల తేడా ఘన విజయం సాధించిన టీమిండియా.. నేడు శ్రీలంకను కొలంబో స్టేడియంలో ఢీకొట్టనుంది. ఈ రోజు సాయంత్రం 3 గంటల నుంచి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. అయితే.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడిన మరుసటి రోజే మరో వన్డే మ్యాచ్‌ ఆడుతుండటంతో టీమిండియా క్రికెటర్లపై వర్క్‌లోడ్‌ ప్రెజర్‌ పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది కీలక ఆటగాళ్లుకు రెస్ట్‌ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌తో బరిలోకి దిగిన టీమిండియా.. లంకపై కొన్ని మార్పులతో ఆడనున్నట్లు తెలుస్తుంది. పాక్‌పై సెంచరీతో చెలరేగి అద్భుతమైన టచ్‌లో ఉన్న విరాట్‌ కోహ్లీతో పాటు స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా లేదా సిరాజ్‌కు ఈ మ్యాచ్‌లో రెస్ట్‌ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కోహ్లీ స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ను ఆడించే అవకాశం ఉంది. అలాగే బుమ్రా లేదా సిరాజ్‌కు రెస్ట్‌ ఇస్తే.. షమీని ఆడించే ఛాన్స్‌ ఉంది. మిగతా టీమ్‌ మొత్తం బరిలోకి దిగనుంది. అలాగే సూర్యకుమార్‌ యాదవ్‌కు అవకాశం దక్కినా ఆశ్చర్యపోవాల్సి పనిలేదు.

భారత్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌ సంగతి అలా ఉంచితే.. ఈ మ్యాచ్‌ కూడా వర్షం అంతరాయం కలిగించే అవకావం ఉంది. ఇప్పటికే ఆసియా కప్‌లో టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. లీగ్‌ దశలో జరిగిన ఇండియా పాకిస్థాన్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. సూపర్‌ 4లో కూడా వర్షం అంతరాయం కలిగించింది. కానీ, రిజర్వ్‌ డే ఉండటంతో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సాధ్యమైంది. కానీ, పాక్‌తో మ్యాచ్‌ ముగిసిన వెంటనే లంకతో మ్యాచ్‌ ఉండటంతో టీమిండియాకు కాస్త ఇబ్బందిగా మారింది. వర్షం రాకపోతే.. టీమిండియా ఎలాంటి మార్పులతో బరిలోకి దిగుతుందో అనేది ఆసక్తి కరంగా మారింది.

టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌ (అంచనా)

రోహిత్‌ శర్మ(కెప్టెన్‌, శుబ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌/సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, జడేజా, శార్దుల్‌ ఠాకూర్‌, షమీ, సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌.

ఇదీ చదవండి: IND vs PAK: 8 వికెట్లకే పాకిస్థాన్‌ ఆలౌట్‌! ఈ ABS HURT అంటే ఏంటి?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి