పాక్ పరువు తీసిన రమీజ్ రాజా.. ఆ విషయంలో BCCIని చూసి నేర్చుకోవాలంటూ..!

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా ఆ దేశ పరువు తీశాడు. ఆ విషయంలో బీసీసీఐని చూసి నేర్చుకోవాలని అన్నాడు.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా ఆ దేశ పరువు తీశాడు. ఆ విషయంలో బీసీసీఐని చూసి నేర్చుకోవాలని అన్నాడు.

పాకిస్థాన్ జట్టు టీ20 వరల్డ్ కప్ ప్రిపరేషన్స్​ను మొదలుపెట్టింది. మెగా టోర్నీకి ముందు ఐర్లాండ్ టీమ్​తో ఆ తర్వాత ఇంగ్లండ్​తో సిరీస్​లు ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఐర్లాండ్​తో టీ20 సిరీస్​ను పూర్తి చేసుకుంది. మూడు టీ20ల ఈ సిరీస్​ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది దాయాది జట్టు. మొదటి టీ20లో చిత్తుగా ఓడి విమర్శలపాలైన బాబర్ సేన.. తర్వాత కోలుకొని వరుసగా రెండు మ్యాచుల్లో విజయాలు సాధించింది. ఈ సిరీస్ పాక్​కు మంచి ప్రాక్టీస్​గా ఉపయోగపడింది. బ్యాటర్లు, బౌలర్లు తిరిగి ఫామ్​ను అందుకోవడానికి బాగా హెల్ప్ చేసింది. అయితే ఈ సిరీస్​లోని ఫస్ట్ మ్యాచ్​ నుంచి చాలా విధాలుగా విమర్శలు ఎదుర్కొంటోంది పాక్. తాజాగా పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజా రాజా ఆ దేశ పరువు తీశాడు.

పాకిస్థాన్ పరువు తీశాడు రమీజ్ రాజా. ఐర్లాండ్-పాకిస్థాన్ టీ20 సిరీస్ నిర్వహణ మీద ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇంటర్నేషనల్ సిరీస్​ను నిర్వహించే తీరు ఇదేనా అంటూ దుయ్యబట్టాడు. ఈ రెండు జట్ల మధ్య జరిగిన సిరీస్ చూస్తుంటే అంతర్జాతీయ మ్యాచులు చూసినట్లుగా అనిపించలేదని.. ఏదో క్లబ్ క్రికెట్ చూసిన ఫీలింగ్ కలిగిందంటూ ట్రోల్ చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కాబట్టి ఇలాంటి పరిస్థితి నెలకొందని, అదే భారత క్రికెట్ బోర్డు ఉంటే ఊరుకునేదా అని క్వశ్చన్ చేశాడు. పాకిస్థాన్​ను ఆఫ్రికా జట్టులా చూస్తున్నారని.. ఇదేం బ్రాడ్​కాస్టింగ్ అని నిలదీశాడు.

ఐర్లాండ్-పాకిస్థాన్ సిరీస్​లో బ్రాడ్​కాస్టింగ్ చాలా చెత్తగా ఉంది. ఇంటర్నేషనల్ మ్యాచ్​ను చూస్తున్నట్లు నాకు అనిపించలేదు. ఏదో క్లబ్ లెవల్​ గేమ్​ను చూస్తున్న అనుభూతే కలిగింది. ఈ సిరీస్​లో రీప్లేస్ లేవు. డీఆర్ఎస్​లు కూడా లేకపోవడం దారుణం. పీసీబీ ఉంది కాబట్టి పరిస్థితి ఇలా ఉంది. అదే బీసీసీఐ ఉండి ఉంటే వేరేలా ఉండేది. ఇంత చెత్తగా కవరేజ్ చేస్తే భారత క్రికెట్ బోర్డు ఊరుకునేది కాదు. ఇలాంటి బ్రాడ్​కాస్టింగ్​కు బీసీసీఐ ఒప్పుకోదు. పాకిస్థాన్​ మ్యాచుల్ని ఇంత దారుణంగా టెలికాస్ట్ చేయడం ఏంటి? అదేమైనా ఆఫ్రికా జట్టు అనుకుంటున్నారా?’ అని రమీజ్ రాజా ఫైర్ అయ్యాడు. మన జట్టు ఆడుతోందంటే మ్యాచ్​ల నిర్వహణ ఎంత పకడ్బందీగా ఉండాలనేది బీసీసీఐని చూసి నేర్చుకోవాలని హితవు పలికాడు.

Show comments