IPL 2024: 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న IPL 2024 సీజన్!

ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ ఐపీఎల్ 2024 సీజన్ సగం పూర్తైంది. ఈ సగం సీజన్ లోనే ఎన్నో రికార్డులు బద్దలు అయ్యాయి. మరి ఈ ఐపీఎల్ లో నమోదైన రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ ఐపీఎల్ 2024 సీజన్ సగం పూర్తైంది. ఈ సగం సీజన్ లోనే ఎన్నో రికార్డులు బద్దలు అయ్యాయి. మరి ఈ ఐపీఎల్ లో నమోదైన రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. క్రికెట్ లవర్స్ ను ఊర్రూతలూగిస్తూ ఐపీఎల్ 2024 సగం సీజన్ ను పూర్తి చేసుకుంది. ఈ హాఫ్ సీజన్ లోనే రికార్డుల మీద రికార్డులు బద్దలు కావడంతో పాటుగా సరికొత్త ఘనతలు సృష్టించబడ్డాయి. తాజాగా మరో ఘతన నమోదైంది. మరి సగం సీజన్ పూర్తైన తర్వాత ఈ ఐపీఎల్ లో నమోదైన రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఐపీఎల్ 2024 సీజన్ ఎన్నడూ లేని విధంగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక జట్లు సృష్టించే రికార్డుల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సీజన్ లో బౌలర్ల కంటే బ్యాటర్లే ఎక్కువగా రెచ్చిపోతున్నారు. మరీ ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ప్రత్యర్థుల పాలిట యమకింకరులుగా మారారు. ఇక ఐపీఎల్ లో మెుత్తం 74 మ్యాచ్ లు జరగాల్సి ఉండగా.. చెన్నై వర్సెస్ లక్నో మ్యాచ్ తో 37 మ్యాచ్ లు అయ్యాయి. దీంతో సగం సీజన్ పూర్తైంది. ఈ క్రమంలో ఐపీఎల్ లో ఎన్నడూ లేనంతగా ఈసారి రికార్డులు బద్దలవుతూ ఉన్నాయి. ఇప్పటికే 8.99 రన్ రేట్ తో ఐపీఎల్ లో అత్యధిక స్కోరింగ్ సీజన్ గా రికార్డుల్లోకి ఎక్కింది.

ఇక ఈ సీజన్ లో ఇప్పటికే 9 సెంచరీలు నమోదు కాగా.. 668 సిక్సర్లు బాదారు ప్లేయర్లు. అంతేకాక ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక టీమ్ స్కోర్ 287 పరుగుల రికార్డ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ తన పేరిట లిఖించుకుంది. అంతకు ముందు ఉన్న తన రికార్డునే (277) బద్దలు కొట్టింది. కాగా.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రికార్డ్స్ క్రియేట్ అవుతుండటం ప్రేక్షకులకు మస్త్ కిక్కిస్తోంది. ఫోర్లు, సిక్సర్ల వర్షంలో అభిమానులు తడిసిముద్దౌతున్నారు. మరి సగం సీజన్ పూర్తైయ్యేసరికే ఈ రేంజ్ లో ఘనతలు లిఖిస్తే.. ఇక పూర్తి సీజన్ ను ముగిసే సరికి ఇంకెన్ని రికార్డులు బద్దలు అవుతాయో? మరి ఈ ఐపీఎల్ సీజన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments