IPL 2024: రోహిత్, ద్రవిడ్ లకు తలనొప్పి తెప్పిస్తున్న యంగ్ ప్లేయర్! ఇలా అయితే కష్టమే..

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో ఓ యంగ్ ప్లేయర్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు, కోచ్ రాహుల్ ద్రవిడ్ కు తలనొప్పిగా మారుతున్నాడు. దానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో ఓ యంగ్ ప్లేయర్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు, కోచ్ రాహుల్ ద్రవిడ్ కు తలనొప్పిగా మారుతున్నాడు. దానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ఐపీఎల్ 2024 సీజన్ లో టీమిండియా యువ ఆటగాళ్లు చెలరేగిపోతున్నారు. మరీ ముఖ్యంగా అన్ క్యాప్ట్ ప్లేయర్లు తమ ఆటతీరుతో సెలెక్టర్లకు, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సరికొత్త తలనొప్పిగా మారుతున్నారు. అందులో ఓ యంగ్ ప్లేయర్ మాత్రం అందరి కంటే ఎక్కువగా ద్రవిడ్, రోహిత్ కు ఇంకాస్త ఎక్కువ తలనొప్పిని తెస్తున్నాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

జూన్ లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కోసం ఇప్పటి నుంచే బీసీసీఐ మాస్టర్ ప్లాన్లను సిద్ధం చేస్తోంది. ఐపీఎల్ లో పాల్గొంటున్న ప్రతీ ఒక్క ప్లేయర్ పై ఓ కన్నేసి ఉంచింది టీమిండియా మేనేజ్ మెంట్. అయితే ఓ యంగ్ ప్లేయర్ మాత్రం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు, కోచ్ రాహుల్ ద్రవిడ్ కు పెద్ద తలనొప్పిగా మారాడు. ఆ ప్లేయర్ మరెవరోకాదు.. ఓవరాక్షన్ స్టార్ గా పేరొందిన రియాన్ పరాగ్. ఈ సీజన్ స్టార్ట్ కాకముందు అసలు టీ20 వరల్డ్ కప్ రేసులోనే లేడు పరాగ్. కానీ ఐపీఎల్ ప్రారంభం అయ్యాక లెక్కలన్నీ మారిపోయాయి. ఈ సీజన్ లో అద్భుతమైన ఆటతీరుతో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ ల్లో 261 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో కూడా ఉన్నాడు. లీడింగ్ స్కోరర్ గా విరాట్ కోహ్లీ తర్వాతి రెండో ప్లేస్ లో ఉన్నాడు పరాగ్.

తాజాగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 48 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సులతో 76 పరుగులు చేశాడు. పరాగ్ ఫామ్ ద్రవిడ్, రోహిత్ కు సరికొత్త తలనొప్పిగా మారింది. అతడు ఇదే ఆటతీరు కొనసాగిస్తే.. టీ20 వరల్డ్ కప్ లో చోటు ఖాయమే. అయితే బీసీసీఐ మాత్రం ఐపీఎల్ ప్రదర్శనను లెక్కలోకి తీసుకోమని ముందే చెప్పింది. పరాగ్ తో పాటుగా మరికొంత మంది యంగ్ ప్లేయర్లు సైతం దుమ్మురేపే ఆటతీరుతో టీ20 వరల్డ్ కప్ రేసులో ఉన్నారు. వారు ఇలాగే రాణిస్తే.. సెలెక్టర్లకు కష్టమనే అంటున్నారు క్రీడా పండితులు. గతంలో ఆటతో కంటే గ్రౌండ్ లో ఓవరాక్షన్ తో ట్రోల్స్ కు గురైన పరాగ్ లో ప్రస్తుతం పూర్తిగా మార్పు వచ్చింది. కేవలం ఆటపైనే దృష్టిపెడుతూ.. విధ్వంసకర ఇన్నింగ్స్ లతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి సూపర్ ఫామ్ తో రెచ్చిపోతున్న పరాగ్ టీ20 వరల్డ్ కప్ జట్టులో ఉంటాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments