క్రికెట్ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్.. సిద్ధూ మళ్లీ వచ్చేస్తున్నాడు!

టీమిండియా మాజీ క్రికెటర్ నవ్​జోత్ సింగ్ సిద్ధూ గుడ్ న్యూస్ చెప్పాడు. అతడి రాక కోసం ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు ఇది కిక్కెక్కించే వార్త అనే చెప్పాలి.

టీమిండియా మాజీ క్రికెటర్ నవ్​జోత్ సింగ్ సిద్ధూ గుడ్ న్యూస్ చెప్పాడు. అతడి రాక కోసం ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు ఇది కిక్కెక్కించే వార్త అనే చెప్పాలి.

నవ్​జోత్ సింగ్ సిద్ధూ.. ఈ పేరు వింటే వెంటనే అందరికీ కామెంట్రీనే గుర్తుకొస్తుంది. టీమిండియా తరఫున సిద్ధూ ఎన్నో సంచలన ఇన్నింగ్స్​లు ఆడినప్పటికీ.. బ్యాటర్​గా కంటే కామెంటేటర్​గానే ఆయనకు ఎక్కువ గుర్తింపు దక్కింది. క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కామెంటేటర్​గా సెటిల్ అయిపోయాడు సిద్ధూ. హిందీ, పంజాబీ భాషల్ని మిక్స్ చేస్తూ ఆయన చేసే కామెంట్రీకి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. మ్యాచ్​లోని సీరియస్ మూమెంట్స్​ను ఆయన తన గాత్రంతో వివరిస్తుంటే ఒక్కోసారి గూస్​బంప్స్ వచ్చేస్తాయి. అయితే చాన్నాళ్ల పాటు కామెంటేటర్​గా ఉన్న ఈ సీనియర్ క్రికెటర్.. ఆ తర్వాత పాలిటిక్స్​లోకి వెళ్లిపోయాడు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పంజాబ్ రాజకీయాల్లో చక్రం తిప్పాడు. అలాంటి సిద్ధూ క్రికెట్ ఫ్యాన్స్​కు తాజాగా గుడ్ న్యూస్ చెప్పాడు.

సిద్ధూ మళ్లీ వచ్చేస్తున్నాడు. ఔను, క్రియాశీల రాజకీయాల్లో బిజీగా ఉంటూ క్రికెట్​కు దూరమైన ఈ వెటరన్ క్రికెటర్ రీఎంట్రీ ఇస్తున్నాడు. తన కామెంట్రీ కోసం ఎదురు చూస్తున్న వారికి ఆయన శుభవార్త చెప్పాడు. మరో మూడ్రోజుల్లో మొదలయ్యే ఐపీఎల్-2024తో కామెంట్రీ కెరీర్​ను తిరిగి స్టార్ట్ చేయనున్నట్లు తెలిపాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మార్చి 22న జరిగే సీజన్ స్టార్టింగ్ మ్యాచ్​లో సిద్ధూ తన కామెంట్రీని ప్రారంభించనున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఐపీఎల్ బ్రాడ్​కాస్టర్స్ స్పార్ స్పోర్ట్స్ ట్విట్టర్​లో ఓ ప్రకటన చేసింది. గ్రేట్ కామెంటేటర్ సిద్ధూ మళ్లీ వచ్చేస్తున్నాడని వెల్లడించింది.

ఇక, 20 ఏళ్ల నాటి ఓ కేసులో సిద్ధూ కొన్నాళ్ల పాటు జైలు జీవితం గడిపి వచ్చారు. 1988లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తి చనిపోయాడు. ఆ కేసులో సిద్ధూకు కోర్టు ఒక ఏడాది పాటు జైలు శిక్షను విధించింది. పది నెలల పాటు జైలులో శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలయ్యాడు నవ్​జ్యోత్. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్​ను కలిశాడు. పంజాబ్ పాలిటిక్స్​లో మళ్లీ ఆయనకు కీలకపాత్ర అప్పగించే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో సిద్ధూ క్రికెట్​ వైపు రావాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఐపీఎల్​కే పరిమితమవుతాడా? లేదా ఆ తర్వాత కూడా సిద్ధూ కామెంట్రీని కంటిన్యూ చేస్తాడా? అనేది మాత్రం క్లారిటీ లేదు. మరి.. సిద్ధూ కమ్​బ్యాక్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments