Nidhan
Team India: టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు ఆటగాళ్లు ట్రోఫీతో స్వదేశానికి తిరిగొచ్చారు. వాళ్లకు గ్రాండ్ రేంజ్లో వెల్కమ్ లభించింది. ఈ తరుణంలో టీమిండియా గురించి లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Team India: టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు ఆటగాళ్లు ట్రోఫీతో స్వదేశానికి తిరిగొచ్చారు. వాళ్లకు గ్రాండ్ రేంజ్లో వెల్కమ్ లభించింది. ఈ తరుణంలో టీమిండియా గురించి లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Nidhan
టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు ఆటగాళ్లు ట్రోఫీతో స్వదేశానికి తిరిగొచ్చారు. వాళ్లకు గ్రాండ్ రేంజ్లో వెల్కమ్ లభించింది. రోహిత్ సేనను చూసేందుకు ఎయిర్‌పోర్ట్‌లో వందలాది మంది అభిమానులు గుమిగూడారు. అక్కడి నుంచి ప్లేయర్లు ఎటు వెళ్తే వాళ్లను అటు ఫాలో అవుతున్నారు. ఢిల్లీలో ల్యాండ్ అయిన మెన్ ఇన్ బ్లూ.. ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయింది. మోడీతో కలసి భారత ఆటగాళ్లంతా బ్రేక్‌ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ప్లేయర్‌ను ప్రధాని ఆత్మీయంగా పలకరించారు. టీ20 వరల్డ్ కప్ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మోడీ ఇంటి నుంచి ముంబై ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరారు ఆటగాళ్లు. ముంబైలో ఇవాళ సాయంత్రం రోడ్ షో, ఆ తర్వాత వాంఖడేలో సన్మానం జరగనుంది.
ఈ హడావుడిని కాస్త పక్కనబెడితే.. భారత్ కప్పు అందుకోవడంలో కీలక పాత్ర వహించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. మరికొన్నాళ్లు ఆడే సత్తా ఉన్నా యువకులకు అవకాశం ఇవ్వాలని అనుకోవడం, ప్రపంచ కప్ కల నెరవేరడంతో పొట్టి ఫార్మాట్‌కు వాళ్లు గుడ్‌బై చెప్పేశారు. అయితే ఇన్నాళ్లూ టీ20ల్లో టీమిండియాకు వాళ్లు అందించిన సేవలు, వరల్డ్ కప్‌లో జట్టును నడిపించిన తీరును అటు అభిమానులు, ఇటు మాజీ క్రికెటర్లు, ఎక్స్పర్ట్స్ గుర్తుచేసుకుంటున్నారు. బ్యాటింగ్ లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా వీళ్లిద్దరి సేవల్ని కొనియాడాడు. ముఖ్యంగా కోహ్లీ గురించి అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. విరాట్ లాంటోడు మళ్లీ ఇండియాలో పుట్టడని అన్నాడు.
‘భారత జట్టులో విరాట్ కోహ్లీ ఓ అద్భుతం. అలాంటి ప్లేయర్ మళ్లీ ఇండియాలో పుట్టడు. ఒక బ్యాటర్‌గా ఎవరైనా ఇంతకంటే ఇంకేం చేయగలరు? అతడు టీమ్ కోసం అవసరమైన టైమ్‌లో పరుగులు చేశాడు. టీమిండియా ఫైనల్లో నెగ్గి ఛాంపియన్స్‌గా అవతరించింది. అతడికి హ్యాపీ ఫేర్వెల్ లభించింది. కోహ్లీకి నా హ్యాట్సాఫ్. అలాంటి ఆటగాళ్లను మళ్లీ ప్రొడ్యూస్ చేయడం అంటే మాటలు కాదు’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో కోహ్లీనే బెస్ట్ బ్యాటర్ అని మెచ్చుకున్నాడు. 2014, 2016, 2022 వరల్డ్ కప్స్‌లో చాలా మ్యాచుల్లో అతడు టీమ్‌ను సింగిల్ హ్యాండ్‌తో గెలిపించాడని.. ఈసారి కూడా ఫైనల్లో సూపర్బ్ నాక్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడని పేర్కొన్నాడు. టీ20ల్లో సక్సెస్ అయినట్లే మిగతా రెండు ఫార్మాట్లలోనూ అతడు ఇలాగే విజయవంతం అవ్వాలని, హై స్టాండర్డ్స్ సెట్ చేయాలని కోరుకుంటున్నట్లు వీరూ వివరించాడు. మరి.. కోహ్లీ లాంటోడు మళ్లీ పుట్టడనే వ్యాఖ్యపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.