IND vs SL Gautam Gambhir Field Setup MS Dhoni: మొదటి వన్డేలో ఈ ఫీల్డ్ సెటప్ గమనించారా? అప్పుడు ధోనీకి వేసిన స్కెచ్ గుర్తు చేస్తూ!

Gautam Gambhir: మొదటి వన్డేలో ఈ ఫీల్డ్ సెటప్ గమనించారా? అప్పుడు ధోనీకి వేసిన స్కెచ్ గుర్తు చేస్తూ!

India vs Sri Lanka: టీ20ల్లో శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. వన్డే సిరీస్​లోనూ ఆ టీమ్​ను వణికిస్తోంది. మొదటి వన్డేలో ఆతిథ్య జట్టును భయపెడుతోంది రోహిత్ సేన.

India vs Sri Lanka: టీ20ల్లో శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. వన్డే సిరీస్​లోనూ ఆ టీమ్​ను వణికిస్తోంది. మొదటి వన్డేలో ఆతిథ్య జట్టును భయపెడుతోంది రోహిత్ సేన.

టీ20ల్లో శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. వన్డే సిరీస్​లోనూ ఆ టీమ్​ను వణికిస్తోంది. మొదటి వన్డేలో ఆతిథ్య జట్టును భయపెడుతోంది రోహిత్ సేన. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్​కు దిగింది శ్రీలంక. అయితే ఆ జట్టుకు టీమిండియా బౌలర్లు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ లంకను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్​లో వాషింగ్టన్ సుందర్ వేసిన ఓవర్ హైలైట్​గా నిలిచింది. అప్పట్లో ఐపీఎల్​లో ధోనీకి గంభీర్ వేసిన స్కెచ్​ను గుర్తు చేస్తూ ఈ ఓవర్ సాగింది.

తొలి వన్డేలో మిగతా అందరు బ్యాటర్లు తక్కువ స్కోర్లకే వెనుదిరిగినా ఓపెనర్ పతుమ్ నిస్సంక (75 బంతుల్లో 56) మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. సింగిల్స్​తో స్ట్రైక్ రొటేట్ చేస్తూ అప్పుడుప్పుడూ బౌండరీలు బాదుతూ ఒక ఎండ్​ను కాపాడుకుంటూ వచ్చాడు. దీంతో అతడి కోసం కోచ్​ గంభీర్​  చెప్పిన స్కెచ్​నే ఫాలో అయ్యాడు కెప్టెన్ రోహిత్ శర్మ. 27వ ఓవర్​లో సుందర్​ను బౌలింగ్​కు దింపిన హిట్​మ్యాన్.. డిఫరెంట్​గా ఫీల్డ్ సెట్ చేశాడు. ఫస్ట్ స్లిప్​తో పాటు సెకండ్ స్లిప్​ను కూడా మోహరించాడు. అలాగే మిగతా ఫీల్డర్లను కూడా క్లోజ్​గా ఉంచి బ్యాటర్​ను టెంప్ట్ చేశాడు. ఈ ఎత్తుగడ వర్కౌట్ అయింది. దీన్ని ఎలా ఛేదించాలో తెలియక నిస్సంక ఎల్​బీడబ్ల్యూ అయ్యాడు.

అప్పట్లో ఐపీఎల్​లో లెజెండ్ ధోనీకి ఇదే మాదిరిగా టైట్ ఫీల్డింగ్ పెట్టి ఇబ్బంది పెట్టాడు గంభీర్. కేకేఆర్​కు కెప్టెన్​గా ఉన్న గౌతీ.. ధోనీని రన్ తీసేందుకు భయపడేలా చేశాడు. పీయూష్ చావ్లా ఓవర్​లో ఏం చేయాలో మాహీకి పాలుపోలేదు. భారీ షాట్లు ఆడటం, ఈజీగా స్ట్రైక్ రొటేషన్ చేసే అతడికి గంభీర్ ముచ్చెమటలు పట్టించాడు. ఇవాళ లంకతో మ్యాచ్​లోనూ క్రీజులో పాతుకుపోయిన నిస్సంక మీద అదే స్ట్రాటజీని ఉపయోగించారు. అది భలేగా వర్కౌట్ అయింది. నిస్సంక తర్వాత వచ్చిన లియానాగే త్వరగా ఔట్ అవడంతో లంక 200 చేయడం కూడా కష్టంగా మారింది. గంభీర్ స్ట్రాటజీ చూసిన నెటిజన్స్.. నువ్వేమీ మారలేదయ్యా అని అంటున్నారు. మరి.. గంభీర్-రోహిత్ స్ట్రాటజీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments