IND vs SA: సూర్యకుమార్ బెస్ట్ కెప్టెన్ అనడానికి ఇదే ఉదాహరణ! హ్యాట్సాఫ్!

  • Author singhj Published - 12:05 PM, Wed - 13 December 23

కెప్టెన్సీ అంటే అధికారం కాదు.. బాధ్యత. దాన్ని సరిగ్గా నెరవేర్చాలంటే త్యాగం చేయడం కూడా అలవర్చుకోవాలని చాలా మంది లెజెండరీ కెప్టెన్స్ చూపించారు. అదే మార్గంలో భారత తాత్కాలిక సారథి సూర్యకుమార్ నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది.

కెప్టెన్సీ అంటే అధికారం కాదు.. బాధ్యత. దాన్ని సరిగ్గా నెరవేర్చాలంటే త్యాగం చేయడం కూడా అలవర్చుకోవాలని చాలా మంది లెజెండరీ కెప్టెన్స్ చూపించారు. అదే మార్గంలో భారత తాత్కాలిక సారథి సూర్యకుమార్ నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది.

  • Author singhj Published - 12:05 PM, Wed - 13 December 23

సౌతాఫ్రికాతో జరగాల్సిన మొదటి టీ20 రద్దు కావడం తెలిసిందే. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయింది. దీంతో రెండో మ్యాచ్ అయినా జరుగుతుందా? లేదా? అందరూ టెన్షన్ పడ్డారు. మ్యాచ్​కు ముందు వాన పడేలా అనిపించడంతో ఇది కూడా వర్షార్పణం అని అనుకున్నారు. కానీ వరుణుడు కరుణించడంతో మ్యాచ్ స్టార్ట్ అయింది. టాస్ నెగ్గిన సఫారీ టీమ్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్​రమ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్​కు దిగాల్సి వచ్చింది. అయితే టాస్ దగ్గర నుంచి భారత్​కు ఏదీ కలసిరాలేదు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (0), శుబ్​మన్ (0) గోల్డెన్​ డక్​గా వెనుదిరిగారు. ఆస్ట్రేలియా సిరీస్​లో ధనాధన్ ఇన్నింగ్స్​లు ఆడుతూ టీమ్​కు క్విక్ స్టార్ట్స్ ఇచ్చిన జైస్వాల్ కేవలం 3 బంతులు ఆడి ఔటయ్యాడు.

ప్రొటీస్ పేసర్ మార్కో యాన్సెన్ వలలో చిక్కి పెవిలియన్​కు చేరాడు జైస్వాల్. స్కోరు బోర్డు మీదకు ఒక్క రన్ కూడా చేరకుండానే అతడు ఔటయ్యాడు. దీంతో మరో ఓపెనర్ గిల్ అయినా టీమ్​ను ఆదుకుంటాడని భావిస్తే అతడూ చేతులెత్తేశాడు. లిజాడ్ విలియమ్స్​ బౌలింగ్​లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు గిల్. స్కోరు బోర్డు పైకి 6 రన్స్ కూడా రాలేదు.. అప్పటికే ఇద్దరు ఓపెనర్లు వెళ్లిపోయారు. దీంతో ఇన్నింగ్స్​ను బిల్డ్ చేయాల్సిన బాధ్యత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (56), హైదరాబాదీ తిలక్ వర్మ (29) మీద పడింది. వీళ్లు ఏమాత్రం టెన్షన్ పడకుండా ఆడారు. ముఖ్యంగా సూర్య అయితే ఫోర్లు, సిక్సులతో చెలరేగిపోయాడు.

సూర్య ఇన్నింగ్స్​లో 5 బౌండరీలు, 3 సిక్సులు ఉన్నాయి. తిలక్ కూడా వీలున్నప్పుడల్లా ఫోర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే వేగంగా ఆడే క్రమంలో స్పీడ్​స్టర్ గెరాల్డ్ కొయెట్జీకి చిక్కాడు. అయినా ధైర్యం కోల్పోని సూర్యకుమార్.. రింకూ సింగ్ (48 నాటౌట్) అండగా ఇన్నింగ్స్​ను నడిపించాడు. రింకూ క్రీజులో సెటిల్ అయ్యేందుకు ఏమాత్రం టైమ్ తీసుకోలేదు. తన స్టైల్​లో సిక్సులు కాకుండా ఎక్కువగా బౌండరీలు బాదాడు. అయితే స్పిన్నర్ షంసీ బౌలింగ్​లో సూర్య పెవిలియన్​కు చేరుకున్నాడు. దీంతో టీమ్​ను భారీ స్కోరు దిశగా తీసుకెళ్లాల్సిన బాధ్యత రింకూ మీద ఉంది. ప్రస్తుతం జితేష్ శర్మ (1 నాటౌట్)తో పాటు రింకూ క్రీజులో ఉన్నారు. వీళ్లిద్దరూ ఎన్ని ఓవర్ల వరకు క్రీజులో ఉంటారనే దాన్ని బట్టి టీమిండియా ఎంత స్కోరు చేస్తుందనేది డిపెండ్ అవుతుంది. అయితే ఈ మ్యాచ్​తో సూర్య మరోమారు తాను ఎందుకు బెస్ట్ కెప్టెన్ అనేది ప్రూవ్ చేసుకున్నాడు.

రింకూ ఆడిన ఓ రివర్స్ స్వీప్ షాట్ మిస్సయింది. బాల్ కాస్తా బ్యాట్​ను కాకుండా అతడి ప్యాడ్స్​కు తగిలింది. దీంతో అంపైర్లు అతడ్ని ఔట్​గా ప్రకటించారు. అయితే రింకూ డౌట్​గా రివ్యూకు పోతానంటే సూర్య ఓకే అన్నాడు. అప్పటికే ఒక రివ్యూ పోయింది. ఇంకా సగం ఓవర్లు ఉన్నాయి. పర్సనల్​గా సూర్య ఆడుతున్నాడు. అయినా ఇవేవీ పట్టించుకోకుండా రింకూ కోసం రివ్యూకు ఓకే చెప్పాడు. తను ఔటైనా రింకూ ఉంటే టీమ్​కు భారీ స్కోరు అందిస్తాడనే నమ్మకంతో ఓ కెప్టెన్​గా అతడికి అండగా నిలబడ్డాడు. అదే సక్సెస్ అయింది. రివ్యూలో బాల్ అతడి చేతికి తగిలిందని స్పష్టంగా తేలింది. దీంతో రింకూ బ్యాటింగ్​ను కంటిన్యూ చేశాడు. మరి.. రింకూ కోసం సూర్య త్యాగం చేయడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Reliance: అంబానీ చేతికి డిస్నీ ప్లస్ హాట్​స్టార్! చేతులారా చేసుకున్న డిస్నీ!

Show comments