Rohit Sharma Words Weird Said Madan Lal: రోహిత్ ​శర్మవి మతి లేని మాటలు.. మండిపడ్డ వరల్డ్ కప్ హీరో!

రోహిత్ ​శర్మవి మతి లేని మాటలు.. మండిపడ్డ వరల్డ్ కప్ హీరో!

  • Author singhj Published - 02:04 PM, Sat - 2 September 23
  • Author singhj Published - 02:04 PM, Sat - 2 September 23
రోహిత్ ​శర్మవి మతి లేని మాటలు.. మండిపడ్డ వరల్డ్ కప్ హీరో!

భారత జట్టు కెప్టెన్ రోహిత్​ శర్మపై మాజీ లెజెండ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. హిట్​మ్యాన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు మతి లేనివని.. అవి చాలా వింతగా ఉన్నాయని అన్నాడు. కొన్ని రోజుల కింద ప్రతిష్టాత్మక ఆసియా కప్​ కోసం టీమిండియాను ప్రకటించారు. ఆ సమయంలో ప్రెస్​మీట్​లో పాల్గొన్నాడు రోహిత్. ఈ సందర్భంగా టీమ్​లోని బ్యాటర్లు ఎప్పుడైనా, ఏ స్థానంలోనైనా బ్యాటింగ్​కు దిగేందుకు రెడీ ఉండాలని అన్నాడు. ఫలానా స్థానంలోనే ఆడతానని, ఈ నెంబర్​లోనే బాగా ఆడతానని ఎవరూ అనకూడదన్నాడు. ఏ పొజిషన్​లోనైనా ఆడగలిగే ప్లేయర్లు తమకు కావాలన్నాడు రోహిత్.

భారత బ్యాటర్లను ఉద్దేశించి కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలపై లెజెండరీ ఆల్​రౌండర్, 1983 వరల్డ్ కప్ హీరో మదన్ లాల్ స్పందించాడు. హిట్​మ్యాన్ కామెంట్స్ తనకు వింతగా అనిపించాయన్నాడు. బ్యాటర్ల గురించి రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నాడు మదన్ లాల్. ఈ మాటలు అర్థం పర్థం లేనివని ఆయన అభిప్రాయపడ్డాడు. రోహిత్ అభిప్రాయంతో తాను పూర్తిగా విభేదిస్తున్నానని.. అతడివి మతి లేని వ్యాఖ్యలని మదన్ లాల్ మండిపడ్డాడు. టీమ్​లో నిలకడ ముఖ్యమని, ఇలాంటి అనవసర ప్రయోగాలు కాదని సూచించాడు.

‘బ్యాటింగ్ ఆర్డర్​ను పదేపదే మారిస్తే ఎవరికీ ఈ జన్మలో కాన్ఫిడెన్స్ రాదు. మ్యాచ్ సిచ్యువేషన్​ను బట్టి ఒకరిద్దరి స్థానాలు మారిస్తే తప్పు లేదు. కానీ ప్రతి ప్లేయర్​కు జట్టులో తన పాత్ర ఏంటో క్లారిటీ ఉండాలి. మ్యాచ్​లో రన్స్ చేయడం గురించి బ్యాటర్లకు స్పష్టత ఉండాలి. టీ20ల్లో అయితే క్రీజులోకి వెళ్లాక అందరూ ఒకేలా బ్యాటింగ్ చేస్తారు, భారీ షాట్లు ఆడతారు. ఆ ఫార్మాట్​లో అదే ముఖ్యం. కానీ వన్డేల్లో అది సాధ్యం కాదు. అందరూ ఎక్కడైనా బ్యాటింగ్ చేస్తారని రోహిత్ చెప్పడం చూసి నాకు మైండ్ బ్లాంక్ అయింది’ అని మదన్ లాల్ వ్యాఖ్యానించాడు.

ఇదీ చదవండి: ఆ ఇద్దరు చెలరేగితే టీమిండియాదే విజయం!

Show comments