వరల్డ్ కప్‌కు ట్రయల్స్‌గా భావించే మినీ టోర్నీనే ఆసియా కప్. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో సత్తా చాటేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు సిద్ధమైంది. ఇవాళ జరిగే తొలి మ్యాచ్‌లో తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఇప్పటికే ఆడిన మొదటి మ్యాచ్‌లో పసికూన నేపాల్‌ను చిత్తుచేసింది పాక్. దీంతో మరింత ఆత్మవిశ్వాసంతో భారత్‌తో పోరుకు ముందుకు సాగుతోంది. ఇరు జట్లు విజయం కోసం ఆఖరి వరకు పోరాడటతాయి కాబట్టి అసలైన వినోదాన్ని ఆస్వాదించేందుకు ప్రేక్షకులు రెడీ అవుతున్నారు.
జట్ల పరంగా చూసుకుంటే భారత్, పాక్.. రెండూ బలంగా ఉన్నాయి. ఆ మధ్య కాస్త వీక్‌గా కనిపించిన పాకిస్థాన్ ఇప్పుడు బలంగా తయారైంది. ముఖ్యంగా పేస్ త్రయం షాహిన్ అఫ్రిది, హ్యారిస్ రౌఫ్, నసీం షా రూపంలో పవర్ఫుల్ పేసర్లు ఆ జట్టులో ఉన్నారు. వీళ్లు గనుక చెలరేగితే ఎదుర్కోవడం ఎంతటి బ్యాట్స్‌మెన్‌కైనా కష్టమే. నియంత్రణతో కూడిన పేస్, వైవిధ్యం, స్వింగ్‌తో కూడిన బంతులను ఫేస్ చేయాలంటే బ్యాట్స్‌మన్ ఎంతో ఓపిగ్గా ఉండాలి. పాక్ జట్టులో మంచి బ్యాటర్లు ఉన్నప్పటికీ ఆ టీమ్ మెయిన్ బలం పేసర్లేనని విశ్లేషకులు అంటున్నారు. ఒకరకంగా ఇది భారత బ్యాటింగ్‌కు పాక్ బౌలింగ్‌కు మధ్య జరిగే యుద్ధమని చెబుతున్నారు.
భారత్, పాక్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న పల్లెకెలెలో రికార్డులు మాత్రం టీమిండియాకు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ భారత్ చివరగా శ్రీలంకతో వన్డే మ్యాచ్ ఆడింది. ఇందులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంకను భారత బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. ముఖ్యంగా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా (5/27) రెచ్చిపోయి బౌలింగ్ చేశాడు. ఇక, 218 పరుగుల లక్ష్య ఛేదనలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (145 బంతుల్లో 124 నాటౌట్) సెంచరీతో చెలరేగడంతో టీమిండియా అలవోకగా విజయతీరాలకు చేరుకుంది. ఒకవేళ పాక్‌తో మ్యాచ్‌లోనూ బుమ్రా, రోహిత్ చెలరేగితే భారత్‌కు తిరుగుండదని ఫ్యాన్స్ అంటున్నారు. పల్లెకెలెలో ఆ ఇద్దరు ప్లేయర్లు మరోమారు చెలరేగితే చాలు.. విజయం మనదేనని చెబుతున్నారు. మరి.. బుమ్రా, రోహిత్ బాగా ఆడి ఫ్యాన్స్ ఆశల్ని నిలబెడతారో లేదో చూడాలి.
ఇదీ చదవండి: టాస్ ఓడితే భారత్‌కు ఓటమి తప్పదా?
When India last played an ODI at Pallekele Stadium:
Jasprit Bumrah picked 5/27 and Rohit Sharma scored 124* (145) in a 218 run chase against Sri Lanka. pic.twitter.com/mjtbeCK1ju
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 2, 2023