వరల్డ్ కప్‌లో భారత్ వరుసగా తొమ్మిదో విజయాన్ని నమోదు చేసింది. అయితే అంతా బాగానే ఉన్నా ఆ ఒక్క విషయంలో మాత్రం టీమ్ వెనుకబడింది. కోచ్ రాహుల్ ద్రవిడ్ సరైన ప్లానింగ్ చేయని కారణంగా ఆ విషయంలో జట్టు వీక్‌గా కనిపిస్తోందని అనలిస్టులు అంటున్నారు.
వరల్డ్ కప్‌లో భారత్ వరుసగా తొమ్మిదో విజయాన్ని నమోదు చేసింది. అయితే అంతా బాగానే ఉన్నా ఆ ఒక్క విషయంలో మాత్రం టీమ్ వెనుకబడింది. కోచ్ రాహుల్ ద్రవిడ్ సరైన ప్లానింగ్ చేయని కారణంగా ఆ విషయంలో జట్టు వీక్‌గా కనిపిస్తోందని అనలిస్టులు అంటున్నారు.
వన్డే ప్రపంచ కప్-2023లో టీమిండియా సూపర్ ఫామ్‌లో ఉంది. లీగ్ దశను మరో భారీ విక్టరీతో ముగించింది. లీగ్ స్టేజ్‌లో ఆడిన తొమ్మిదికి 9 మ్యాచుల్లోనూ నెగ్గి సెమీస్‌కు వెళ్తోంది భారత్. నెదర్లాండ్స్‌తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన వన్డేలో 160 రన్స్ తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన అన్ని ఓవర్లాడి 410 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (61), శుబ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లీ (51) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. శ్రేయస్ అయ్యర్ (128 నాటౌట్), కేఎల్ రాహుల్ (102) సెంచరీలతో అదరగొట్టారు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన డచ్ టీమ్ 47.5 ఓవర్లలో 250 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌తో పాటు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు తలో రెండు వికెట్లు తీశారు. కోహ్లీ, కెప్టెన్ రోహిత్ చెరో వికెట్‌తో మెరిశారు. అయితే పేసర్ మహ్మద్ షమీకి వికెట్ దక్కలేదు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 9 మంది ప్లేయర్లతో బౌలింగ్ చేయించాడు హిట్‌మ్యాన్. రెగ్యులర్ బౌలర్లలో సిరాజ్, షమీతో ఆరేసి ఓవర్లు మాత్రమే వేయించాడు. ఈ పేసర్లకు రెస్ట్ ఇచ్చిన రోహిత్.. బుమ్రాతో మాత్రం 9 ఓవర్లు బౌలింగ్ చేయించాడు. స్పిన్నర్లను కూడా ఫుల్ కోటా వేసేలా చేశాడు. అలాగే కోహ్లీ, గిల్, సూర్యకుమార్లతోనూ బౌలింగ్ వేయించాడు. శుబ్‌మన్ వికెట్ తీయకపోయినా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. పార్ట్ టైమర్లలో విరాట్ అందరికంటే బాగా ఆకట్టుకున్నాడు. అతడ్ని ఎదుర్కొనేందుకు ప్రత్యర్థి బ్యాటర్లు తడబడ్డారు.
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో 9 మందితో బౌలింగ్ చేయించాలనే రోహిత్-ద్రవిడ్ ప్రయోగం కొంతమేర సక్సెస్ అయింది. హిట్‌మ్యాన్, కోహ్లీ ఒక్కో వికెట్ తీశారు. గిల్, సూర్యకు కూడా బౌలింగ్ ప్రాక్టీస్ దొరికింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో మంచి బ్యాలెన్స్ తీసుకొస్తున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా లేకపోవడంతో ఆరో బౌలింగ్ ఆప్షన్ కోసం భారత్ ఈ ప్రయోగం చేసినట్లుగా కనిపిస్తోంది. బుమ్రా, సిరాజ్, షమి, జడేజా, కుల్దీప్ల్లో ఎవరైనా ఫెయిలైతే ఆరో బౌలర్ వచ్చి కొన్ని ఓవర్లు వేసేలా, అవసరమైన టైమ్‌లో బ్రేక్ త్రూ ఇచ్చేందుకు ఈ ఆప్షన్ కోసం ప్రయత్నించారు. కానీ ఈ విషయంలో కోచ్ ద్రవిడ్ వెనుకబడ్డాడనే చెప్పాలి.
ఆరో బౌలర్‌ను కొన్ని సిరీస్‌లకు ముందు నుంచే తయారు చేసుకుంటే బాగుండేది. తీరా వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్‌కు ముందు ఆప్షన్ కోసం వెతుక్కోవడంపై విమర్శలు వస్తున్నాయి. సిక్స్ బౌలింగ్ ఆప్షన్ కోసం కోహ్లీ, గిల్, రోహిత్, సూర్యల్లో నుంచి ఎవరైనా ఇద్దర్నీ ముందు నుంచి ప్రిపేర్ చేయాల్సింది. కొన్ని సిరీస్‌ల్లో బౌలింగ్ చేయిస్తే ఈపాటికి వాళ్లు మంచి రిథమ్‌లో ఉండేవారని.. ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని అంటున్నారు. కేవలం ఒక్క మ్యాచ్ ప్రాక్టీస్‌తో నాకౌట్ లాంటి తీవ్ర ఒత్తిడి ఉన్న మ్యాచ్‌లో పార్ట్ టైమర్లను బౌలింగ్ చేయమనడం ఎంత వరకు కరెక్ట్ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఓపెనింగ్, టాపార్డర్, మిడిలార్డర్, కీపింగ్, లోయరార్డర్ అంటూ బ్యాటింగ్ విషయంలో.. పేసర్లు, స్పిన్నర్లు, ఆల్‌రౌండర్లు అంటూ బౌలింగ్ విషయంలోనూ ఏడాది ముందు నుంచే పక్కా ప్లానింగ్‌తో ఉన్న కోచ్ ద్రవిడ్ పార్ట్ టైమర్లను లైట్ తీసుకున్నాడని అంటున్నారు. హార్దిక్ పాండ్యాపై అతిగా డిపెండ్ అవ్వడం, అతడికి బ్యాకప్ లేకపోవడం, పార్ట్ టైమర్లను తయారు చేసుకోకపోవడం బిగ్ మ్యాచెస్‌లో భారత్‌ను దెబ్బతీసే ప్రమాదం పొంచి ఉందని క్రికెట్ అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో ద్రవిడ్ ముందే మేల్కొని సరిగ్గా ప్లాన్ చేసుకొని ఉంటే సరిపోయేదని చెబుతున్నారు. మరి.. పార్ట్ టైమర్ల ప్లానింగ్ విషయంలో ద్రవిడ్ వెనుకబడటంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కోహ్లీ గురించి అలా మాట్లాడి తప్పు ఒప్పుకున్న స్టార్ క్రికెటర్!