Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మైల్‌స్టోన్స్ వల్ల ఎవరికి ఉపయోగమన్నాడు. టీమ్‌లోని ప్లేయర్లందరి గోల్ ఒకటేనన్నాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మైల్‌స్టోన్స్ వల్ల ఎవరికి ఉపయోగమన్నాడు. టీమ్‌లోని ప్లేయర్లందరి గోల్ ఒకటేనన్నాడు.
Nidhan
మైల్‌స్టోన్స్, రికార్డ్స్.. ఏ గేమ్లోనైనా వీటికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్లోనూ మైలురాళ్లకు అంతే ప్రాధాన్యం ఇస్తారు. ఎవరెన్ని సెంచరీలు కొట్టారు? ఎన్ని వికెట్లు తీశారు? లాంటి వాటి గురించి ఎప్పుడూ డిస్కషన్స్ నడుస్తూనే ఉంటాయి. పాత రికార్డులు బ్రేక్ అయినప్పుడు ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే మైల్‌స్టోన్స్ ఎవరికి కావాలి అంటున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అవి దేనికీ పనికి రావన్నాడు. వ్యక్తిగత రికార్డులు, మైలురాళ్ల కంటే టీమ్ విజయమే తమకు ముఖ్యమన్నాడు హిట్‌మ్యాన్. భారత జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడి గోల్ ఒకటేనన్నాడు. తమ జట్టులో వ్యక్తిగత రికార్డుల కంటే దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామని స్పష్టం చేశాడు. అసలు రోహిత్ దేని గురించి ఇలా మాట్లాడాడో ఇప్పుడు తెలుసుకుందాం..
2019 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ ఏకంగా 5 సెంచరీలు బాదాడు. అయినా ఆ టోర్నీలో భారత్ ఛాంపియన్షిప్ గెలవలేకపోయింది. 2023 ప్రపంచ కప్‌లో రోహిత్‌తో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాట్‌తో చెలరేగిపోయాడు. అయినా జట్టుకు కప్పును అందించలేకపోయారు. ఈ నేపథ్యంలో రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఎన్ని సెంచరీలు కొట్టామనేది కాదు.. కప్పు కొట్టామా? లేదన్నదే ముఖ్యమన్నాడు. 2019 వరల్డ్ కప్‌లో తాను బాదిన ఐదు సెంచరీలు వేస్ట్ అయిపోయాని.. వాటి గురించి ఎవరూ డిస్కస్ చేయరని తెలిపాడు. టీమిండియాలో తాను ఓ మార్పును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. మైల్‌స్టోన్స్, రికార్డ్స్, స్టాటిస్టిక్స్.. లాంటి వాటిని పూర్తిగా పక్కన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నాడు హిట్‌మ్యాన్. ఇప్పుడు జట్టులో ఉన్న వారికి వాళ్ల వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు గెలుపే ప్రధానంగా మారిందన్నాడు.
‘టీమ్‌లో కొన్ని మార్పులు తీసుకురావాలని నిశ్చయించుకున్నా. అందులో భాగంగానే ఆటగాళ్లు గ్రౌండ్లో మరింత స్వేచ్ఛగా ఆడేలా చూస్తున్నా. వాళ్లు ఫుల్ ఫ్రీడమ్‌తో ఆడుతున్నారు. రికార్డులు, స్టాటిస్టిక్స్, మైల్స్టోన్ గోలను పక్కన పెట్టేసి.. గేమ్ మీదే పూర్తిగా ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు జట్టులోని ఆటగాళ్లు పర్సనల్ స్కోర్స్‌ను పట్టించుకోవడం లేదు. టీమ్ గెలిచిందా లేదా అనే దాని పైనే వాళ్ల దృష్టి ఉంది. ఎందుకో గానీ మనం నంబర్స్‌కు అతిగా ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాం. భారత్‌లో స్కోర్లు, రికార్డుల గురించి ఎక్కువగా చర్చిస్తారు. కానీ దాని కంటే జట్టు గెలుపోటములే ముఖ్యం. మా టీమ్‌లోని ప్రతి ఆటగాడు ఇప్పుడు వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు గెలుపే లక్ష్యంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. హిట్‌మ్యాన్ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. అతడు చెప్పిన దాంట్లో తప్పు లేదని.. టీమ్ గెలిస్తే రికార్డులు బోనస్ అవుతాయని.. లేదంటే ఎన్ని మైల్‌స్టోన్స్ క్రియేట్ చేసినా వృథానే అని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. వ్యక్తిగత రికార్డుల కంటే టీమ్ గెలుపే ముఖ్యమంటూ హిట్‌మ్యాన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma wants to bring a cultural change in how the team plays.#WorldCup #IndianCricketTeam #RohitSharma #BCCI #CricketTwitter pic.twitter.com/fVVoZIFt9O
— InsideSport (@InsideSportIND) January 27, 2024