వీడియో: కరెక్ట్‌గా బాల్‌ దూరేంత సందే ఉంది! క్లీన్‌ బౌల్డ్‌ చేసిన అశ్విన్‌

వందో టెస్టులో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగిపోతున్నాడు. పట్టపగలే ఇంగ్లీష్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అతడు చేసిన ఓ క్లీన్ బౌల్డ్​ అయితే మ్యాచ్​కే హైలైట్​గా నిలిచింది.

వందో టెస్టులో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగిపోతున్నాడు. పట్టపగలే ఇంగ్లీష్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అతడు చేసిన ఓ క్లీన్ బౌల్డ్​ అయితే మ్యాచ్​కే హైలైట్​గా నిలిచింది.

ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్​ను భారత్ బెంబేలెత్తిస్తోంది. ఆ జట్టు బ్యాటర్లతో మన బౌలర్లు చెడుగుడు ఆడుకుంటున్నారు. ముఖ్యంగా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు క్రీజులో నిలబడాలంటేనే ఇంగ్లీష్ ప్లేయర్స్ వణుకుతున్నారు. డిఫెన్స్ చేసినా షాట్స్ ఆడినా వికెట్ పోతుండటంతో ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే సగానికి పైగా టీమ్ పెవిలియన్​లో కూర్చుంది. అశ్విన్ స్పిన్ మ్యాజిక్​కు ప్రత్యర్థి జట్టు దాసోహం అంటోంది. 5 వికెట్లు తీసిన సీనియర్ స్పిన్నర్.. బెన్ స్టోక్స్​ను వెనక్కి పంపిన విధానం మాత్రం మ్యాచ్​కే హైలైట్ అని చెప్పాలి.

కరెక్ట్​గా బాల్ దూరేంత సందే ఉంది. కానీ స్టోక్స్​ను క్లీన్ బౌల్డ్ చేశాడు అశ్విన్. ఆ మ్యాజికల్ బాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడు వేసిన బాల్ ఆఫ్ స్టంప్​కు అవతల పడి లోపలకు దూసుకొచ్చింది. అయితే స్టోక్స్​ దాన్ని డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ అది కొద్దిలో అతడి బ్యాట్​ ఎడ్జ్​ను తప్పించుకుంది. ఆ టైమ్​లో స్టోక్స్ బ్యాట్​కు ప్యాడ్​కు మధ్య కాస్త గ్యాప్ ఉంది. అంతే అందులో దూరిన బాల్ వేగంగా వచ్చి సరిగ్గా ఆఫ్ స్టంప్​ను గిరాటేసింది. క్లీన్ బౌల్డ్ కావడంతో స్టోక్స్ షాకయ్యాడు. అసలు బాల్ వెళ్లేందుకు చోటే లేదు.. ఎక్కడి నుంచి వెళ్లి వికెట్లను పడేసిందో అర్థం కాక పిచ్చోడైపోయాడు. స్టోక్స్​ను అశ్విన్ ఔట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి.. అశ్విన్ మ్యాజికల్ డెలివరీపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: 100వ టెస్టులో చరిత్ర సృష్టించిన అశ్విన్‌.. తొలి భారత క్రికెటర్​గా అరుదైన రికార్డు!

Show comments