ఫ్యాన్స్​కు బ్యాడ్ న్యూస్.. భారత్-బంగ్లాదేశ్ సిరీస్ రద్దు?

IND vs BAN Series To Be Cancelled: భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీమిండియా మ్యాచులకు భారీగా గ్యాప్ రావడంతో ఈ సిరీస్ మీద ఎక్కడలేని ఆసక్తి నెలకొంది.

IND vs BAN Series To Be Cancelled: భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీమిండియా మ్యాచులకు భారీగా గ్యాప్ రావడంతో ఈ సిరీస్ మీద ఎక్కడలేని ఆసక్తి నెలకొంది.

భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీమిండియా మ్యాచులకు భారీగా గ్యాప్ రావడంతో ఈ సిరీస్ మీద ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. శ్రీలంక టూర్ తర్వాత దాదాపు ఏడు వారాల పాటు భారత జట్టు మ్యాచ్​లు లేకుండా పోయాయి. దీంతో ఆటగాళ్లంతా రెస్ట్ మోడ్​లోకి వెళ్లిపోయారు. కొందరు వెకేషన్స్​లో బిజీ అయిపోతే.. ఇంకొందరు ఇంటి వద్దే ఫ్యామిలీతో కలసి టైమ్ స్పెండ్ చేశారు. ఇప్పుడు బంగ్లా సిరీస్​కు సమయం ఆసన్నమవడంతో అంతా ఒక దగ్గరకు చేరి జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 19న మొదలయ్యే ఫస్ట్ టెస్ట్​కు రెడీ అవుతున్నారు. బంగ్లాను చిత్తు చేయాలని అనుకుంటున్నారు. రెండు టెస్టుల సిరీస్​ను గ్రాండ్ విక్టరీతో స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఫ్యాన్స్​కు బ్యాడ్ న్యూస్. ఈ మ్యాచ్​తో పాటు మొత్తం సిరీస్ రద్దు కానుందని తెలుస్తోంది.

భారత్-బంగ్లా సిరీస్ క్యాన్సిల్ కానుందని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ఇరు జట్ల మధ్య జరగాల్సిన టెస్టు సిరీస్​తో పాటు టీ20 సిరీస్ కూడా రద్దయ్యే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. హిందూ మహాసభ నిరసన కారణంగా సిరీస్​ రద్దయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. బంగ్లాదేశ్​లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈ సిరీస్​ను అడ్డుకోవాలంటూ నిరసనలు చేపట్టాలని హిందూ మహాసభ డిసైడ్ అయింది. తొలి టెస్ట్​కు ఆతిథ్యం ఇస్తున్న చెన్నైలో నిరసన సెగ లేనప్పటికీ.. సెకండ్ టెస్ట్​ జరిగే కాన్పూర్​లో, అలాగే మొదటి టీ20కు హోస్ట్​గా ఉన్న గ్వాలియర్​లో హిందూ మహాసభ భారీగా నిరసనలు చేపట్టాలని చూస్తోంది.

Show comments