రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ బ్యాటర్లకు సాధ్యం కాని ఓ ఫీట్‌ను రుతురాజ్ గైక్వాడ్ సాధించాడు. ఆసీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రుతు చరిత్ర సృష్టించాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ బ్యాటర్లకు సాధ్యం కాని ఓ ఫీట్‌ను రుతురాజ్ గైక్వాడ్ సాధించాడు. ఆసీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రుతు చరిత్ర సృష్టించాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ దుమ్మురేపుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన అపోజిషన్ టీమ్ కెప్టెన్ మాథ్యూ వేడ్ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మన జట్టుకు మంచి స్టార్ట్ లభించలేదు. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (6)ను క్రీజులో కుదురుకోక ముందే పెవిలియన్‌కు పంపాడు బెరెన్‌డార్ఫ్. బాల్ బాగా స్వింగ్ అవుతుండటంతో ఆసీస్ పేసర్లు చెలరేగి బౌలింగ్ చేశారు. జైస్వాల్‌ను ఔట్ చేసిన ఊపులో ఇషాన్ కిషన్ (0)ను కూడా వెనక్కి పంపారు. రిచర్డ్సన్ బౌలింగ్‌లో ఇషాన్ గోల్డెన్ డక్ అయ్యాడు. అయితే అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (39)తో కలసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు రుతురాజ్ గైక్వాడ్ (123 నాటౌట్).
రుతురాజ్-సూర్య ఆస్ట్రేలియా బౌలర్లపై అటాకింగ్‌కు దిగారు. ముఖ్యంగా రుతు అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సూర్య ఔటైనా తిలక్ వర్మ (31 నాటౌట్) సాయంతో టీమ్‌కు భారీ స్కోరును అందించాడు. ఆఖరి ఓవర్లలో ఆసీస్ బౌలర్లను చీల్చిచెండాడాడు రుతురాజ్. మొదటి 21 బంతుల్లో 21 రన్స్ చేసిన అతడు.. ఆ తర్వాత 31 బంతుల్లో ఏకంగా 81 రన్స్ చేశాడు. రుతు ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్ విధ్వంసం ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. లాస్ట్ ఓవర్ వేసేందుకు వచ్చిన గ్లెన్ మాక్స్‌వెల్‌కు అతడు చుక్కలు చూపించాడు.
మాక్స్వెల్ వేసిన ఆఖరి ఓవర్లో 6 బంతులు ఆడిన రుతురాజ్ ఏకంగా 30 రన్స్ పిండుకున్నాడు. అందుకే ఒక దశలో 180 చేసినా గొప్పే అనుకున్నా టీమిండియా.. ఏకంగా 222 రన్స్ చేసింది. రుతు కెరీర్లో ఇది మెయిడిన్ సెంచరీ. టీ20ల్లో ఆసీస్‌పై ఫస్ట్ సెంచరీ కొట్టిన ఇండియన్ బ్యాటర్‌గానూ రుతు చరిత్ర సృష్టించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ బ్యాటర్లకు కూడా సాధ్యం కాని రీతిలో కంగారూలపై సెంచరీ బాది తానేంటో మరోమారు అతడు ప్రూవ్ చేసుకున్నాడు. మరి.. రుతురాజ్ ఇన్నింగ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పాండ్యా.. ఇంత డబ్బు పిచ్చి ఎందుకు? కోహ్లీని చూసి బుద్ధి తెచ్చుకో..!
TAKE A BOW, RUTURAJ GAIKWAD…!!!!
He was 21* (21) and finished with 123* (57) with 13 fours and 7 sixes. Scored 102 runs in the last 36 balls, one of the craziest accelerations. A knock to remember by the Super Rutu…!!! 🫡🔥 pic.twitter.com/ZZvUcULh06
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 28, 2023