సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పేసిన రింకూ సింగ్.. అదే కారణమంటూ..!

  • Author singhj Published - 02:11 PM, Mon - 27 November 23

భారత నయా పించ్​ హిట్టర్ రింకూ సింగ్ తన సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పేశాడు. తన విజయానికి అదే కారణమన్నాడు.

భారత నయా పించ్​ హిట్టర్ రింకూ సింగ్ తన సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పేశాడు. తన విజయానికి అదే కారణమన్నాడు.

  • Author singhj Published - 02:11 PM, Mon - 27 November 23

టీ20 వరల్డ్ కప్-2024 ప్రిపరేషన్స్​ను టీమిండియా విజయవంతంగా మొదలుపెట్టింది. పొట్టి ఫార్మాట్​లో జరిగే ప్రపంచ కప్​కు మరో 7 నెలల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో టీమ్ కాంబినేషన్​ను సెట్ చేసుకునే పనిలో పడింది భారత్. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు వచ్చే వరల్డ్ కప్​కు అందుబాటులో ఉండారో లేదో క్లారిటీ లేదు. కాబట్టి బెంచ్​ మీద ఉన్న జూనియర్లను అవకాశాలు ఇస్తూ ప్రపంచ కప్ సన్నాహకాలను ప్రారంభించింది. ఒకవేళ కోహ్లీ, హిట్​మ్యాన్ లాంటి బిగ్ ప్లేయర్స్ లేకున్నా యంగ్​స్టర్స్​తో మెగా టోర్నీకి కాన్ఫిడెంట్​గా వెళ్లాలని డిసైట్ అయినట్లు కనిపిస్తోంది. అందుకే వరుసగా టీ20 సిరీస్​లను షెడ్యూల్ చేసింది. ఇందులో భాగంగా ఆసీస్​తో జరుగుతున్న టీ20 సిరీస్​లో భారత్ దుమ్మురేపుతోంది.

వైజాగ్​లో జరిగిన తొలి టీ20 మ్యాచ్​లో తీవ్ర ఉత్కంఠ మధ్య ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది టీమిండియా. తిరువనంతపురం వేదికగా ఆదివారం జరిగిన రెండో మ్యాచులో కంగారూలను 44 రన్స్ తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్​లో ఫస్ట్ బ్యాటింగ్​కు దిగిన మన టీమ్ ఓవర్లన్నీ ఆడి 4 వికెట్లకు 235 రన్స్ చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (58), యశస్వి జైస్వాల్ (53), ఇషాన్ కిషన్ (52) అదరగొట్టారు. ఆఖర్లో రింకూ సింగ్ (31) కూడా బ్యాట్ ఝళిపించడంతో ఆసీస్ ముందు భారీ టార్గెట్ ఉంచింది భారత్. మన జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో అపోజిషన్ టీమ్ తడబడింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. మన బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలో 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నారు.

అక్షర్ పటేల్, ముకేష్ కుమార్, అర్ష్​దీప్ సింగ్​ కూడా ఒక్కో వికెట్ తీసి భారత్ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్​లో టీమిండియా ఇన్నింగ్స్​లో రింకూ సింగ్ బ్యాటింగ్ మెరుపులతో అందర్నీ ఆకట్టుకున్నాడు. మొదటి మ్యాచ్​లో తీవ్ర ఉత్కంఠ మధ్య ఆఖరి వరకు నిలబడి కూల్​గా మ్యాచ్​ను ఫినిష్ చేసిన రింకూ.. రెంటో టీ20లోనూ చివర్లో బాగా ఆడాడు. 9 బంతుల్లో 2 సిక్సులతో పాటు 4 బౌండరీలు బాది 31 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. టీ20ల్లో టార్గెట్ 200 ఉంటే ఛేజ్ చేయొచ్చు. కానీ అదనంగా మరో 25 నుంచి 30 రన్స్ చేస్తే మాత్రం ఛేదించడం చాలా కష్టంగా మారుతుంది. ఆఖర్లో రింకూ అందించిన అదనపు స్కోరుతోనే భారత్ ఈ మ్యాచ్​లో 44 రన్స్ తేడాతో నెగ్గింది. వరుసగా రెండు మ్యాచుల్లో సూపర్బ్ నాక్స్​తో అందరి దృష్టిని ఆకర్షించాడు రింకూ సింగ్.

కెప్టెన్ సూర్యకుమార్ కూడా రింకూ ధోనీని తలపిస్తున్నాడని మెచ్చుకున్నాడు. అయితే మ్యాచ్ తర్వాత బ్రాడ్​కాస్టర్​తో మాట్లాడిన రింకూ సింగ్.. తన సక్సెస్ సీక్రెట్ ఏంటో రివీల్ చేశాడు. ‘ఐదు, ఆరో పొజిషన్స్​లో నాకు ఆడిన ఎక్స్​పీరియెన్స్ ఉంది. ఈ స్థానాల్లోనే నేను ఎక్కువగా బ్యాటింగ్ చేశా. అయితే ఈ ప్లేస్​లో ఆడేటప్పుడు రన్స్ చేయాలంటే ప్రశాంతత చాలా ముఖ్యం. డెత్ ఓవర్స్​లో బాల్స్ ఎక్కడ పడుతున్నాయో చూసి ఆడేందుకు నేను ఇష్టపడతా. బౌలర్ స్లో బాల్ వేస్తున్నాడా? లేదా ఫాస్ట్ బాల్ సంధిస్తున్నాడా? అనేది పసిగట్టాకే షాట్ కొడతా. బాల్ వచ్చే వరకు ఎదురు చూశాకే ఏ షాట్ ఆడాలో డిసైడ్ అవుతా. ఇదే నా సక్సెస్ సీక్రెట్. ఎన్ని బాల్స్ ఆడాననే దాని కంటే టీమ్​కు కావాల్సిన రన్స్ చేయడమే ఫినిషర్​గా నా రెస్పాన్సిబిలిటీ. అందుకు తగ్గట్లే నెట్స్​లో ప్రాక్టీస్ చేస్తున్నా’ అని రింకూ చెప్పుకొచ్చాడు. మరి.. ఆసీస్​తో సిరీస్​లో రింకూ సింగ్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ముంబై నుంచి RCBకి రూ.17 కోట్ల ప్లేయర్‌! బెంగళూరు లైనప్ మామూలుగా లేదుగా..!

Show comments