డ్రెస్సింగ్ రూమ్​లో కోహ్లీ కన్నీరు! సెంచరీ కోసమా? లేక?

  • Author singhj Updated - 05:05 PM, Mon - 9 October 23
  • Author singhj Updated - 05:05 PM, Mon - 9 October 23
డ్రెస్సింగ్ రూమ్​లో కోహ్లీ కన్నీరు! సెంచరీ కోసమా? లేక?

వన్డే వరల్డ్ కప్​-2023 ఫస్ట్ మ్యాచ్​లో ఆస్ట్రేలియాపై భారత్ గెలుపులో ఇద్దరు ప్లేయర్లు కీలక పాత్ర పోషించారు. అందులో ఒకరు ఇంజ్యురీ తర్వాత కమ్​బ్యాక్ ఇస్తున్న కేఎల్ రాహుల్ అయితే.. మరొకరు ఛేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ. వీళ్లిద్దరూ మంచి ఫామ్​లో ఉన్న సంగతి తెలిసిందే. ఎంత ఫామ్​లో ఉన్నా ఒత్తిడి సమయంలో బ్యాటింగ్ చేయడం, తప్పులకు తావివ్వకుండా టీమ్​ను విజయతీరాలకు చేర్చడం అంత ఈజీ కాదు. కానీ దీన్ని నిజం చేసి చూపించారు విరాట్-రాహుల్. ఓపెనర్లు రోహిత్​ శర్మతో పాటు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్​లు గోల్డెన్ డక్​గా వెనుదిరగడంతో కోహ్లీ (85)-రాహుల్ (97 నాటౌట్) తప్పక క్రీజులో నిలబడాల్సిన పరిస్థితి.

వరల్డ్ కప్​ క్వార్టర్స్ లేదా సెమీస్ దశలో ఎదురవుతుందేమో అనుకున్న ఛాలెంజ్ కాస్తా టీమిండియా మొదటి మ్యాచ్​లోనే ఫేస్ చేయాల్సి వచ్చింది. అయినా కోహ్లీ-రాహుల్ వెనుకడగు వేయలేదు. సవాల్​ను స్వీకరించి క్రీజులో నిలబడ్డారు. ఆసీస్ బౌలర్లు బౌన్సర్లు, స్వింగ్ డెలివరీస్​తో కవ్విస్తున్నా సంయమనం పాటించారు. టెస్టు క్రికెట్ తరహాలో మంచి బంతులను డిఫెన్స్ చేస్తూ.. కాస్త ఛాన్స్ దొరికినా బౌండరీలకు తరలించారు. అలాగే సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ కంగారూ బౌలర్లను విసిగించారు. డేంజరస్ బౌలరైన ఆడం జాంపా లాంటి వాళ్లు బౌలింగ్​కు వచ్చినప్పుడు ఉతికి ఆరేశారు. దీంతో కంగారూ కెప్టెన్ ప్యాట్ కమిన్స్​కు ఏం చేయాలో పాలుపోలేదు. కోహ్లీ కాస్త ముందే ఔటైనా హార్దిక్ పాండ్యాతో కలసి రాహుల్ మ్యాచ్ ఫినిష్ చేశాడు. అయితే ఈ మ్యాచ్​లో సెంచరీ చేసే ఛాన్స్​ను విరాట్​తో పాటు రాహుల్ కూడా మిస్సయ్యాడు.

కోహ్లీ ఔట్ కాకపోతే వంద మార్క్​ను ఈజీగా చేరుకునేవాడు. చివర్లో హార్దిక్ సిక్స్ కొట్టకపోయినా రాహుల్ సెంచరీ చేసేవాడు. సెంచరీ మిస్సవ్వడంతో అతడు కాస్త బాధలో కనిపించాడు. అయితే సెంచరీ కొట్టలేకపోయాననే బాధ రాహుల్ కంటే విరాట్​లో ఎక్కువగా కనిపించింది. ఔటయ్యాక డ్రెస్సింగ్ రూమ్​కు వెళ్లిన కోహ్లీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కింగ్ తలబాదుకుంటూ కనిపించాడు. అయితే ఇంత బాధ సెంచరీ కోసమేనా అని ఈ వీడియో చూసిన నెటిజన్స్ అంటున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం మ్యాచ్ ఫినిష్ చేయలేకపోయినందుకు.. టీమ్​ గెలిచే దాకా క్రీజులో లేనందుకే కోహ్లీ అంతగా బాధపడ్డాడని అంటున్నారు. మరి.. కోహ్లీ కన్నీళ్లు పెట్టుకోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: శ్రేయాస్ అయ్యర్‌పై యువరాజ్ ఫైర్! తెరపైకి కొత్త రచ్చ!

Show comments