వన్డే వరల్డ్ కప్-2023లో భారత టీమ్‌కు శుభారంభం దక్కింది. టఫ్ సిచ్యువేషన్స్‌ను ఎదుర్కొని మరీ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో విక్టరీ కొట్టింది. టీమిండియా గెలుపులో కింగ్ విరాట్ కోహ్లీ (85)తో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కేఎల్ రాహుల్ (97 నాటౌట్) కీలక పాత్రో పోషించారు. కోహ్లీ ఔటైనా రాహుల్ మాత్రం ఆఖరి వరకు క్రీజులో ఉండి సిక్స్ కొట్టి మరీ జట్టుకు విజయాన్ని అందించాడు. మరో మూడు రన్స్ చేసుంటే రాహుల్ సెంచరీ పూర్తయి ఉండేది. అయితే అంతకు ముందు ఓవర్లో హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టడంతో రాహుల్‌కు ఆ ఛాన్స్ మిస్సయింది.
సెంచరీ మిస్సయినా తనకు బాధేం లేదని.. టీమ్ గెలుపే ముఖ్యమని కేఎల్ రాహుల్ అన్నాడు. రెండు రన్స్‌కే కీలకమైన మూడు వికెట్లు పడిపోయినప్పుడు తాను క్రీజులోకి వచ్చానన్నాడు. అయితే దీని గురించి మరీ ఎక్కువగా కంగారు పడలేదన్నాడు. కోహ్లీతో పిచ్ గురించి అంతగా డిస్కస్ చేయలేదన్నాడు రాహుల్. కానీ విరాట్ తనకో విషయం చెప్పాడన్నాడు. పిచ్ చాలా కఠినంగా ఉందని.. టెస్ట్ మ్యాచ్ మాదిరిగా కాసేపు బ్యాటింగ్ చేయాలని కోహ్లీ తనకు సూచించాడని రాహుల్ తెలిపాడు. మొదట్లో పిచ్ పేసర్లకు సహకరించిందని.. కానీ తర్వాత స్పిన్నర్లకూ హెల్ప్ అయిందన్నాడు.
‘పిచ్ తొలుత పేసర్లకు ఆ తర్వాత స్పిన్నర్లకు అనుకూలించింది. అయితే 15-20 ఓవర్లప్పుడు మాత్రం తేమ ప్రభావం వల్ల బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. బాల్‌పై బౌలర్లకు పట్టు దొరకలేదు. బ్యాటర్లకు, బౌలర్ల సహనానికి ఈ పిచ్ పరీక్ష పెట్టింది. ఆఖర్లో సిక్స్‌ను అద్భుతంగా కొట్టా. గెలుపునకు ఐదు రన్స్ అవసరం ఉంది. దీంతో ఫోర్, సిక్స్ కొడితే సెంచరీ అవుతుందని అనుకున్నా. కానీ బాల్ నేరుగా స్టాండ్స్‌లో పడింది. సెంచరీ మిస్సయినందుకు బాధ లేదు. టీమ్ గెలవడమే ముఖ్యం’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు. ఆసీస్‌తో తాను బ్యాటింగ్‌కు వచ్చే ముందు జరిగిన ఓ ఆసక్తికర విషయం గురించి కూడా రాహుల్ మాట్లాడాడు. స్నానం చేసి కాస్త రెస్ట్ తీసుకుందామని అనుకున్నానని.. కానీ ఆలోపే మూడు వికెట్లు పడిపోవడంతో వెంటనే బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చిందన్నాడు రాహుల్.
ఇదీ చదవండి: World Cup: కోహ్లీకి గోల్డ్ మెడల్! ఆసీస్‌పై బ్యాటింగ్ చేసినందుకు కాదు..
KL Rahul: “Quite honestly, we didn’t have many conversations. I just took a bath and was preparing myself when I had to rush in at that situation”#INDvsAUS
— Cricket.com (@weRcricket) October 8, 2023