IND vs AFG: ఆఫ్ఘాన్‌తో నేడే చివరి టీ20! ఒక్క మార్పుతో బరిలోకి టీమిండియా

బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్‌స్టేడియంలో ఇండియా-ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య మూడో టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఇదే ఈ సిరీస్‌కు చివరి మ్యాచ్‌. మరి ఈ మ్యాచ్‌లో ఇండియా, ఆఫ్ఘనిస్థాన్‌లు ఎలాంటి ప్లేయింగ్‌ ఎలెవన్‌తో బరిలోకి దిగుతున్నాయో ఇప్పుడు చూద్దాం..

బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్‌స్టేడియంలో ఇండియా-ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య మూడో టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఇదే ఈ సిరీస్‌కు చివరి మ్యాచ్‌. మరి ఈ మ్యాచ్‌లో ఇండియా, ఆఫ్ఘనిస్థాన్‌లు ఎలాంటి ప్లేయింగ్‌ ఎలెవన్‌తో బరిలోకి దిగుతున్నాయో ఇప్పుడు చూద్దాం..

ఇండియా-ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ నేటితో ముగియనుంది. బెంగళూరు వేదికగా నేడు ఆఖరి మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి.. సిరీస్‌ను కైవసం చేసుకున్న రోహిత్‌ సేన.. చివరి మ్యాచ్‌ కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయాలని భారత్‌ గట్టి పట్టుదలతో ఉంది. కనీసం ఒక్క మ్యాచ్‌ అయినా గెలిచి సంచలనం సృష్టించాలని ఆఫ్ఘాన్‌ సేన భావిస్తోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. తొలి రెండు మ్యాచ్‌ల్లో బెంచ్‌కి పరిమితమైన ఓ స్టార్‌ క్రికెటర్‌కు కనీసం చివరి మ్యాచ్‌లైనా ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు కల్పించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. మరి ఆ ఆటగాడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం ఈ సిరీస్‌లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ లాంటి సూపర్‌ స్టార్లు ఆడుతుండటంతో క్రికెట్‌ అభిమానుల ఫోకస్‌ అంతా వారిపైనే ఉంది. అలాగే యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్‌, శివమ్‌ దూబే అదరగొడుతుండటంతో.. వారిపై కూడా కాస్త దృష్టి సారించారు. మొత్తంగా ఈ సిరీస్‌తో శివమ్‌ దూబే బాగా హైలెట్‌ అవుతున్నాడు. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ రెండు హాఫ్‌ సెంచరీలు చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అలాగే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అతనికి బౌలింగ్‌ కూడా ఇస్తుండటం, దూబే దాన్ని నిలబెట్టుకుంటూ వికెట్లు కూడా తీస్తుండటంతో దూబేకు జట్టులో తిరుగులేకుండా పోయింది. అయితే.. టీమ్‌లో ఓ స్టార్‌ క్రికెటర్‌ మాత్రం బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అతనే సంజు శాంసన్‌.

భారత జట్టులోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన సంజు.. తన ప్లేస్‌ను ఇప్పటి వరకు సుస్థిరం చేసుకోలేకపోయాడు. గతంలో వన్డే టీమ్‌లో సంజుకు చోటు కల్పించలేదు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో చోటు దక్కకపోవడంపై సంజు ఫ్యాన్స్‌ బీసీసీఐ విమర్శలు కురిపించారు. కానీ, ఇప్పుడు టీ20 వరల్డ్‌ కప్‌ 2024 నేపథ్యంలో సంజును టీ20లకు ఎంపిక చేయడంపై ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. కానీ, ప్లేయింగ్‌ ఎలెవన్‌లో సంజుకి బదులు.. జితేష్‌ శర్మను ఆడిస్తున్నారు. జితేష్‌ మాత్రం రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలం అయ్యాడు. దీంతో కనీసం చివరిదైన మూడో మ్యాచ్‌లోనైనా సంజుకు స్థానం దక్కే అవకాశం ఉంది. ఇక బౌలింగ్‌ విభాగంలో కూడా మార్పులు జరగొచ్చు. మరి సంజుకు మూడో మ్యాచ్‌లో చోటు కల్పించాలనే ఫ్యాన్స్‌ డిమాండ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌(అంచనా)
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, సంజు శాంసన్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్/అవేష్ ఖాన్.

ఆఫ్ఘనిస్థాన్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌(అంచనా)
రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ (సి), గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూకీ

Show comments