వరుసగా రెండు మ్యాచుల్లో నెగ్గి పుంజుకున్నట్లే కనిపించిన భారత జట్టు భంగపడింది. వెస్టిండీస్‌తో చివరి టీ20 మ్యాచ్‌లో ఓడి సిరీస్‌ను 2-3 తేడాతో కోల్పోయింది. నాలుగో మ్యాచ్‌లో పరుగుల వరద పారించిన అదే వేదికలో టీమిండియా తగినంత స్కోరు చేయలేకపోయింది. స్టార్ బ్యాటర్లు బ్రెండన్ కింగ్, నికోలస్ పూరన్ మెరుపులతో కరీబియన్ జట్టు అలవోకగా టార్గెట్‌ను ఛేజ్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ వృథా అయింది. ఈ ఓటమితో భారత్ పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పర్యాటక జట్టు.. 9 వికెట్లకు 165 రన్స్ చేసింది. సూర్యకుమార్ (65) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
విండీస్ జట్టు బౌలర్లలో రొమారియో షెఫర్డ్ (4/31), అకీల్ హొసేన్ (2/24)లు భారత్‌ను బాగా కట్టడి చేశారు. ఛేదనలో బ్రెండన్ కింగ్ (85 నాటౌట్), పూరన్ (47) మెరవడంతో టార్గెట్‌ను వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఆతిథ్య జట్టును కట్టడి చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఒక్క కుల్దీప్ యాదవ్ తప్పితే మిగతా అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. స్పిన్నర్ చాహల్ వేసిన 4 ఓవర్లలో ఏకంగా 51 రన్స్ ఇచ్చుకున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. బౌలింగ్ వైఫల్యం మ్యాచ్‌లో కొట్టొచ్చినట్లు కనిపించింది.
విండీస్ చేతిలో సిరీస్ ఓటమితో భారత్ పలు చెత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. గత 25 నెలల కాలంలో టీమిండియా ఓడిన టీ20 సిరీస్ ఇదే కావడం గమనార్హం. వెస్టిండీస్ చేతిలో ద్వైపాక్షిక సిరీస్‌ను కోల్పోవడం గత 17 ఏళ్లలో ఇదే తొలిసారి. ఒక టీ20 సిరీస్‌లో భారత్ మూడు మ్యాచ్‌లు ఓడిపోవడం కూడా ఇదే ఫస్ట్ టైమ్. ఈ చెత్త రికార్డుల గురించి ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో భారత ఫ్యాన్స్ అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా పనికిరాడని అంటున్నారు. వెస్టిండీస్ మీద సిరీస్ ఓటమి అనేదే లేకుండా 17 ఏళ్లుగా ఉన్న ఘనమైన రికార్డును అతడు నాశనం చేశాడని విమర్శిస్తున్నారు. పాండ్యా ఓ చెత్త కెప్టెన్ అని ట్రోల్ చేస్తున్నారు.
Indian team today:
– Lost a T20i series for the first time in 25 months.
– Lost a bilateral series against West Indies in 17 years.
– Lost 3 matches in a T20i series for the first time in history.
• Our Captain Always Remain In Style 😶#INDvsWI #HardikPandya pic.twitter.com/ClVRj4GltS— Saqlain (@SaqlainHameeed) August 14, 2023