India England First Test-HCA Free Entry To Students: ఉప్పల్‌లో భార‌త్-ఇంగ్లాండ్ మ్యాచ్‌ చూసేందుకు ఫ్రీ ఎంట్రీ.. వారికి మాత్రమే

India England First Test: ఉప్పల్‌లో భార‌త్-ఇంగ్లాండ్ మ్యాచ్‌ చూసేందుకు ఫ్రీ ఎంట్రీ.. వారికి మాత్రమే

ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరగనున్న భార‌త్-ఇంగ్లాండ్ టెస్ట్‌ మ్యాచ్‌ సందర్భంగా హెచ్‌సీఏ బంపరాఫర్‌ ప్రకటించింది. వారికి ఫ్రీ ఎంట్రీ అని వెల్లడించింది. ఆ వివరాలు..

ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరగనున్న భార‌త్-ఇంగ్లాండ్ టెస్ట్‌ మ్యాచ్‌ సందర్భంగా హెచ్‌సీఏ బంపరాఫర్‌ ప్రకటించింది. వారికి ఫ్రీ ఎంట్రీ అని వెల్లడించింది. ఆ వివరాలు..

టీమిండియా జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌తో తలపడనుంది. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ ముందు భారత్ తలపడే ఆఖరి టీ20 సిరీస్ ఇదే. అయితే అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా.. స్వదేశంలో.. ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. దీనిలో భాగంగా హైదరాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జనవరి 25న తొలి టెస్ట్ మ్యాచ్‌ ఆరంభమవుతుంది. ఈ టెస్టు మ్యాచ్‌ కోసం హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. ఈక్రమంలో తాజాగా హెచ్‌సీఏ బంపరాఫర్‌ ప్రకటించింది. ఆ వివరాలు..

ఉప్పల్‌ స్టేడియం వేదికగా టీమిండియా ఇంగ్లాండ్‌తో ఆడనున్న మ్యాచ్‌కు విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ ప్రకటించింది హెచ్‌సీఏ. ఈమేరకు ఓ ప్రకటన చేసింది. దీనిలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో 6-12 తరగతులకు చెందిన విద్యార్థులు ఉచితంగా భారత్‌, ఇంగ్లండ్‌ టెస్ట్ మ్యాచ్‌ను చూడవచ్చని వెల్లడించింది. అంతేకాక మ్యాచ్‌ చూడటానికి వచ్చిన విద్యార్థులందరికి ఉచిత భోజనం సదుపాయం కూడా ఏర్పాటు చేసింది. అయితే మ్యాచ్‌ను చూడాటానికి వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా వారి స్కూల్‌ యూనిఫామ్‌లోనే స్టేడియానికి రావాలని హెచ్‌సీఏ సూచించింది.

ఆసక్తి ఉన్న స్కూల్‌ యాజమాన్యాలు.. జనవరి 18లోగా హెచ్‌సీఏ సీఈవోకు మెయిల్‌ చేయాల్సి ఉంటుంది. లేదా స్టేడియం వద్దకు వచ్చి వారి వివరాలు తెలియజేయాలని హెచ్‌సీఏ తెలిపింది. అంతేకాక తమ స్కూల్ నుంచి ఎంతమంది విద్యార్థులు, సిబ్బంది వస్తున్నారు అనే వివరాలను ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్‌ ముందుగా తమకు తెలియజేయాలని హెచ్‌సీఏ తెలిపింది. ఆసక్తి ఉన్న పాఠశాలలు జనవరి 18వ తేదీలోపు హెచ్‌సీఏ సీఈవోకు ceo.hydca@gmail.com కు మెయిల్‌ చేయాలి. వీరికి అయిదు రోజుల పాటు ఫ్రీ ఎంట్రీతో పాటు భోజన సదుపాయం ఉంటుంది.

ఉప్పల్‌లో మ్యాచ్‌ తర్వాత.. విశాఖపట్నం వేదికగా.. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టు జరగనుంది. చివరి మూడు టెస్టులకు వరుసగా రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాల ఆతిథ్యం ఇవ్వనున్నాయి. జనవరి 25న ప్రారంభమయ్యే ఈ అయిదు టెస్టుల సిరీస్ మార్చి 11వరకు సాగుతుంది. ఆ వెంటనే ఐపీఎల్ ప్రారంభమవుతుంది. అనంతరం టీమిండియా జూన్‌లో టీ20 ప్రపంచకప్ ఆడనుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా టీ20 వరల్డ్‌ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.

Show comments