IND vs SA Test: సిక్స్ కొట్టి రాహుల్ హాఫ్ సెంచరీ.. ఇది చాలా స్పెషల్ ఇన్నింగ్స్!

టీమిండియా- సౌత్ ఆఫ్రికా తొలి టెస్టులో పోరాడుతున్నాయి. మ్యాచ్ ప్రారంభం నుంచి సౌత్ ఆఫ్రికా బౌలర్లు పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. కానీ, వారికి రాహుల్ చుక్కలు చూపిస్తున్నాడు.

టీమిండియా- సౌత్ ఆఫ్రికా తొలి టెస్టులో పోరాడుతున్నాయి. మ్యాచ్ ప్రారంభం నుంచి సౌత్ ఆఫ్రికా బౌలర్లు పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. కానీ, వారికి రాహుల్ చుక్కలు చూపిస్తున్నాడు.

ఇండియా టూర్ ఆఫ్ సౌతాఫ్రికా ఎంతో ఆసక్తిగా సాగుతోంది. ఇప్పటికే టీ20 సిరీస్ ని 1-1తో టై చేశారు. వన్డే సిరీస్ లో మాత్రం 2-1 తేడాతో విజయం సాధించారు. ఇప్పుడు తొలి టెస్టులో టీమిండియా- సౌత్ ఆఫ్రికా జట్లు పోటీ పడుతున్నాయి. నిజానికి ఈ టెస్టు ప్రారంభం నుంచి సౌత్ ఆఫ్రికా బౌలర్లు పూర్తి ఆధిపత్యం కనబరుస్తున్నారు. టాప్ ఆర్డర్ కాస్తా కుప్పకూలింది. జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ త్వరగానే పెవిలియన్ చేరారు. అయ్యర్- కోహ్లీ నిలదొక్కుకున్నారు అనుకునే సమయంలో అయ్యర్ అవుట్ అయ్యాడు. ఇలాంటి గట్టు సమయంలో కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చాడు. పేకమేడల్లా కూలిపోతున్న వికెట్లకు అడ్డుగా నిలబడ్డాడు.

కేఎల్ రాహుల్ టాలెంట్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాపార్డర్, మిడిలార్డర్ నిలదొక్కుకోలేక పెవిలియన్ చేరుతున్న సమయంలో టెయిలెండర్స్ ని అడ్డు పెట్టుకుని రాహుల్ తన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. కొనసాగించడం మాత్రమే కాకుండా ఒక ఐకానిక్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ అవుటయ్యాక 28వ ఓవర్లో కేఎల్ రాహుల్ అడుగుపెట్టాడు. అప్పటి నుంచి తన ఆటను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎక్కడా కూడా బ్యాడ్ షాట్ పికింగ్ లేకుండా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. ఆచితూచి ఆడుతున్నాడు. లూజ్ బాల్ ని మాత్రమే బౌండరీకి తరలిస్తున్నాడు. వికెట్ల ముందు గోడలా నిలబడిపోయాడు. 80 బంతుల్లో 50 పరుగులు నమోదు చేశాడు. అది కూడా ఒకే ఓవర్లో ఫోర్, సిక్సర్ కొట్టాడు. అంతేకాదు సిక్సర్ సాయంతో రాహుల్ తన అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇలాంటి సమయంలో కేఎల్ రాహుల్ నుంచి ఎంతో మంచి ఇన్నింగ్స్ అనే చెప్పాలి. అయితే రాహుల్ కు మంచి సపోర్ట్ అయితే దొరకడం లేదు.

కేఎల్ రాహుల్ తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్(8), శార్దూల్ ఠాకూర్(24), బుమ్రా(1) ఎవరూ సరైన సపోర్ట్ ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ తో కలిసి కేఎల్ రాహుల్ తన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడింది. ఆట ఆగే సమయానికి మొత్తం 59 ఓవర్లు పూర్తయ్యాయి. అప్పటికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. నిజానికి టీమిండియా 150 పరుగులు కూడా చేయరు అనుకున్నారు. కానీ, అలాంటి పరిస్థితి నుంచి 200 స్కోర్ దాటే వరకు తీసుకొచ్చింది రాహుల్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. అందుకే ఇది రాహుల్ కి మాత్రమే కాదు.. టీమిండియాకి కూడా చాలా స్పెషల్ ఇన్నింగ్స్ అని చెప్పాలి. ప్లేయర్స్ స్కోర్ చూస్తే.. జైస్వాల్(17), రోహిత్ శర్మ(5), శుభ్ మన్ గిల్(2), విరాట్ కోహ్లీ(38), అయ్యర్(31), అశ్విన్(8), శార్దూల్ ఠాకూర్(24), బుమ్రా(1) మాత్రమే స్కోర్ చేయగలిగారు. ఇంక సౌత్ ఆఫ్రికా బౌలింగ్ చూస్తే.. కగిసో రబాడా 5 వికెట్లతో చెలరేగాడు. బర్గెర్ కు 2 వికెట్లు దక్కాయి. జాన్సెన్ కు ఒక వికెట్ మాత్రమే దక్కింది. మరి.. కేఎల్ రాహుల్ ఐకానిక్ అర్ధ శతకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments