Mohammed Siraj: సిరాజ్ దెబ్బకు సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ చూడండి.. ఎలా పడుకున్నారో..!

న్యూల్యాండ్స్ లో టీమిండియా దెబ్బకు సౌత్ ఆఫ్రికా వణికిపోయింది. ఇంక ఫ్యాన్స్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

న్యూల్యాండ్స్ లో టీమిండియా దెబ్బకు సౌత్ ఆఫ్రికా వణికిపోయింది. ఇంక ఫ్యాన్స్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

కేప్ టౌన్ లోని న్యూల్యాండ్స్ మైదానంలో టీమిండియా ప్రదర్శనకు సౌత్ ఆఫ్రికా జట్టు విలవిల్లాడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ప్రొటీస్ జట్టుకు ఫస్ట్ ఇన్నింగ్స్ పీడకలగా మిగిలిపోయింది. టెస్టుల్లో అత్యల్ప స్కోరును కూడా మూటగట్టుకుంది. సౌత్ ఆఫ్రికా జట్టు టెస్టుల్లో నమోదు చేసిన టాప్ 5 అత్యల్ప స్కోర్లలో టీమిండియా మీదే 3 ఉన్నాయి. మొత్తానికి తొలి టెస్టు ప్రతీకారాన్ని ఈ టెస్టులో తీర్చుకున్నట్లు అయ్యింది. సౌత్ ఆఫ్రికా మీద టీమిండియా ఆధిపత్యాన్ని జట్టు మాత్రమే కాదు.. ఫ్యాన్స్ కూడా జీర్ణించు కోలేకపోతున్నారు. స్టేడియంలో సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ నీరుగారి పోతున్నారు. కెమెరా ఎటు చూపించినా ఒక్కరి ముఖంలో కూడా సంతోషం లేదు.

న్యూల్యాండ్స్ లో జరుగుతున్న రెండో టెస్టులో సౌత్ ఆఫ్రికా జట్టు పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఒక్క ఆటగాడు కూడా ఈ స్కోరును తీసుకోలేకపోతున్నారు. ఇంక ఫ్యాన్స్ అయితే వారి పరిస్థితి పగోడికి కూడా రాకూడదు అని కోరుకోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే స్టేడియంలో ఉన్న సౌత్ ఆఫ్రికా అభిమానులు అందరూ ఎంతో నిరాశతో కనిపిస్తున్నారు. కెమెరా మ్యాన్ ఎవరిని చూపిద్దామనుకున్నా అందరూ డల్ గా కనిపిస్తూ ఉన్నారు. ఇంకొక అభిమాని అయితే.. ఏకంగా నిద్రపోతూ కనిపించాడు. కెమెరామ్యాన్ రెండు మూడుసార్లు అతడినే చూపించాడు. ఆ దృశ్యం చూసిన తర్వాత ప్రొటీస్ ఫ్యాన్స్ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. ఈ పిక్స్ చూసిన తర్వాత అందరూ సిరాజ్ దీనికి మొత్తానికి నువ్వే కారణం అంటున్నారు. నువ్వు అంత అద్భుతంగా బౌలింగ్ చేయబట్టే వాళ్లు ఇప్పుడు అలా నిద్రపోతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాసేపటికి మరోసారి కెమెరా అతని వైపునకు తిప్పడంతో అప్పుడే నిద్ర మేల్కొంటున్న అతనికి పక్కనున్న ఆయన అదుకో నిన్ను కెమెరాలో చూపిస్తున్నారు అని చెప్పాడు. నిద్ర నుంచి తేరుకుని ఒక నవ్వు నవ్వాడు. ఆటతో నిరాశ చెందిన సౌత్ ఆఫ్రికా అభిమానులకు ఈ సంఘటన కాసేపు ఆటవిడుపుగా అనిపించి నవ్వేసుకున్నారు.

ఇంక ఈ మ్యాచ్ లో హైదరాబాదీ సిరాజ్ విజృంభణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే బౌలింగ్ చేసిన 9 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా 9 ఓవర్లలో 3 మెయిడిన్ చేయడం విశేషం. టాపార్డర్ నుంచి మిడిలార్డర్ వరకు అందరినీ వరుస పెట్టి పెవిలియన్ కి పంపాడు. సిలాజ్ కి తోడుగా బుమ్రా, మఖేష్ కూడా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. వీళ్ల దెబ్బకు సౌత్ ఆఫ్రికా జట్టు కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మార్కరమ్ నుంచి బర్గర్ వరకు ఎవ్వరూ కనీస పోరాటాన్ని కూడా కనబరచలేదు. వాళ్ల స్కోర్స్ చూస్తే.. మార్కరమ్(2), ఎల్గర్(4), డే జోర్జీ(2), స్టబ్స్(3), బెడింగామ్(12), కైల్ వెరైన్(15), జాన్సన్(0), కేశవ్ మహరాజ్(3), రబాడా(5), బర్గర్(4), లుంగి ఎంగిడి(0) పరుగులు మాత్రమే చేశారు.

బౌలింగ్ పరంగా సిరాజ్ కి తోడుగా బుమ్రా(2 వికెట్లు), ముఖేశ్ కుమార్(2 వికెట్లు) తీసుకున్నారు. ప్రసిద్ కృష్ణ మాత్రం మంచి బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్ స్టార్ట్ చేసిన టీమిండియా సఫారీ బౌలర్లను ముప్పతిప్పలు పెడుతోంది. బ్యాటర్లు సునాయాసంగా ఫోర్లు బాదేస్తున్నారు. రోహిత్ శర్మ ఒకే ఓవర్లో 3 ఫోర్లు కొట్టి బౌలర్లపై మరింత ప్రెజర్ తెచ్చాడు. అయితే కాస్త కోలుకున్న సౌత్ ఆఫ్రికా జట్టు రెండు వికెట్లు పడగొట్టింది. 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి టీమిండియా 96 పరుగులు చేసింది. జైస్వాల్ డకౌట్ గా పెవిలియన్ చేరగా.. రోహిత్ శర్మ 39 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ, గిల్ ఉన్నారు. మరి.. సిరాజ్ దెబ్బకు సౌత్ ఆఫ్రికా ఆడియన్స్ నిద్రపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments