KL Rahul: సెంచరీ తర్వాత రాహుల్ ఎమోషనల్.. దూరంగా ఉంటే మంచిదంటూ..!

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ అనంతరం కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ అనంతరం కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సహచరులంతా సఫారీ పేస్ దళానికి బెంబేలెత్తిన వేళ తానున్నానంటూ ముందుకు వచ్చాడు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్. తొలిరోజు భారత జట్టు ఆలౌట్ కాకుండా అర్దసెంచరీతో అడ్డుగోడలా నిలిచిన రాహుల్.. రెండో రోజు అద్భుతమైన శతకంతో మెరిశాడు. దీంతో అతడిపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే సెంచూరియన్ లో అత్యధిక సెంచరీలు చేసిన పర్యాటక జట్టు బ్యాటర్ గా రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన రాహుల్ ఎమోషనల్ అయ్యాడు. కొన్ని విషయాల వైపు చూడటం, వాటికి దూరంగా ఉండటమే మంచిదంటూ కామెంట్స్ చేశాడు.

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ రికార్డు సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. జట్టు సభ్యులంత విఫలమైన వేళ.. శతకంతో భారత్ కు గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు. కాగా.. సెంచరీ తర్వాత తనపై వచ్చిన విమర్శల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు రాహుల్.”ఈరోజు నేను సెంచరీ కొట్టడంతో.. నాపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ గత 3-4 నెలల క్రితం నన్ను చాలామంది విమర్శించారు. అయితే అది ఆటలో భాగమని నాకు తెలుసు. కానీ ఇలాంటి విషయాలు నీపై ప్రభావం చూపించకూడదు. అయితే విమర్శలను నువ్వు ఎంత త్వరగా మర్చిపోయి, వాటికి దూరంగా ఉంటే.. నీ గేమ్ అంత బాగుంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు కేఎల్ రాహుల్.

దీంతో తనపై వచ్చిన విమర్శలకు రాహుల్ చాలా హర్ట్ అయ్యాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సెంచరీతో పలు రికార్డులు బద్దలు కొట్టాడు రాహుల్. సెంచూరియన్ గ్రౌండ్ లో అత్యధిక సెంచరీలు బాదిన పర్యాటక జట్టు ఏకైక బ్యాటర్ గా నిలిచాడు. సౌతాఫ్రికా గడ్డపై అత్యధిక శతకాలు బాదిన ఆసియా బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు రాహుల్. కాగా.. టెస్టుల్లో రాహుల్ కు ఇది 8వ సెంచరీ. విదేశీ గడ్డపై ఇదే అత్యుత్తమ శతకం అని క్రికెట్ లెజెండ్స్ రాహుల్ శతకాన్ని కొనియాడుతున్నారు. మరి కేఎల్ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments