SNP
Iftikhar Ahmed, GT20 Canada, No Look Six: పాకిస్థాన్ స్టార్ క్రికెటర్.. నో లుక్ సిక్స్ కొట్టి పరువుతీసుకున్నాడు. అది కూడా రషీద్ ఖాన్ కొట్టినట్లు కొట్టబోయి.. విఫలం అయ్యాడు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Iftikhar Ahmed, GT20 Canada, No Look Six: పాకిస్థాన్ స్టార్ క్రికెటర్.. నో లుక్ సిక్స్ కొట్టి పరువుతీసుకున్నాడు. అది కూడా రషీద్ ఖాన్ కొట్టినట్లు కొట్టబోయి.. విఫలం అయ్యాడు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
రషీద్ ఖాన్ అనగానే చాలా మంది స్టార్ స్పిన్నర్ అని, తన లెగ్ స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంటాడని అనుకుంటారు. కానీ, అప్పుడప్పుడు తనలోని విధ్వంసకర బ్యాటర్‌ను నిద్రలేపి.. తానో ఆల్‌రౌండర్ అనే విషయాన్ని గుర్తుచేస్తుంటాడు రషీద్ ఖాన్. ఇటీవలె ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2024లోనూ రషీద్ కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఐర్లాండ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో నో లుక్ సిక్స్‌తో ప్రపంచ క్రికెట్ మొత్తం ఆశ్చర్యపోయేలా చేశాడు. బాల్‌ను చూడకుండా సూపర్ షాట్‌లో సిక్స్‌కి తరలించాడు. అయితే.. అదే షాట్‌ను తాజాగా పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ కూడా ట్రై చేశాడు. కానీ, రషీద్ ఖాన్‌లా సక్సెస్ కాలేక.. పరువుతీసుకున్నాడు.
గ్లోబుల్ టీ20 కెనడా 2024 టోర్నీలో భాగంగా శుక్రవారం బంగ్లా టైగర్స్ మిస్సిసాగా, మాంట్రియల్ టైగర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అంటారియోలోని CAA సెంటర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో.. బంగ్లా టైగర్స్ జట్టు ఆటగాడు ఇఫ్తికార్ అహ్మద్ 24 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో 28 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. కానీ, జహుర్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ మూడో బాల్‌ను.. నో లుక్ షాట్ ఆడాడు. అది డీప్ స్క్వౌర్ లెగ్ దిశగా వెళ్లింది. సిక్స్ వెళ్తుందనే కాన్ఫిడెన్స్‌లో ఇఫ్తికార్ ఉన్నాడు.. కానీ, బాల్ వెళ్లి ఫీల్డర్ చేతుల్లో పడింది. దీంతో.. ఇఫ్తికార్ షాక్ అయ్యాడు. రషీద్ ఖాన్ కొట్టినట్లు.. సిక్స్ కొడదాం అనుకుంటే.. ఇలా అవుట్ అయ్యేనేంటి అనుకుంటూ పెవిలియన్ చేరాడు. రషీద్ కొట్టిన షాట్.. ఇఫ్తికార్ కొట్టిన షాట్‌ను కంప్యార్ చేస్తూ.. క్రికెట్ అభిమానులు జోకులు వేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మాంట్రియల్ టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అస్టన్ అగర్ 41, టిమ్ షైఫర్ట్ 44, దిల్‌ప్రీత్ బజ్వ 41, బెన్ 40 పరుగులతో రాణించారు. బంగ్లా టైగర్స్ బౌలర్లలో డేవిడ్ వైస్ 3 వికెట్లతో సత్తా చాటాడు. ఇక 190 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లా టైగర్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. బంగ్లా టైగర్స్‌లో ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో 64 పరుగులు చేసి రాణించినా.. మిగతా బ్యాటర్లు విఫలం అవ్వడంతో బంగ్లా టైగర్స్ ఓటమి పాలైంది. మాంట్రియల్ టైగర్స్ బౌలర్లలో అయాన్ అఫ్జల్ ఖాన్ 4 వికెట్లతో చెలరేగాడు. మరి ఈ మ్యాచ్‌లో నో లుక్ షాట్ కొట్టి ఇఫ్తికార్ అహ్మద్ అవుట్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Iftikhar Ahmed Out on NO LOOK SIX #NoLookSix #RashidKhan #IftikharAhmad #GT20Canada
Original Copy pic.twitter.com/XlVerHHbxi— Sayyad Nag Pasha (@nag_pasha) July 27, 2024