ఇండియాతో మ్యాచ్‌లో నేను తప్పు చేశాను.. రోహిత్‌ అస్సలు క్షమించలేదు: స్టార్క్‌

Rohit Sharma, Mitchell Starc, IND vs AUS, T20 World Cup 2024: ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌.. టీమిండియా కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరి అతను ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, Mitchell Starc, IND vs AUS, T20 World Cup 2024: ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌.. టీమిండియా కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరి అతను ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో టీమిండియాకు సమవుజ్జీ, గట్టి పోటీ ఇచ్చే టీమ్‌ ఏదంటే ఆస్ట్రేలియా అనే చెప్పాలి. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో ఆసీస్‌ సూపర్‌ 8 దశలోనే ఇంటికి వెళ్లిపోయినా.. ఆ జట్టును తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. క్రికెట్‌లో ఇండియా-ఆస్ట్రేలియా జట్లు తలపడినప్పుడు అసలు సిసలు క్రికెట్‌ మజాను క్రికెట్‌ అభిమానులు ఆస్వాదిస్తూ ఉంటారు. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య భీకరమైన పోటీ ఉంటుంది. బ్యాటర్లకు, బౌలర్లకు మధ్య కోల్డ్‌ వార్‌ కూడా నడుస్తూ ఉంటుంది. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ మధ్య కూడా అలాంటి పోటీ ఉంటుంది.

కొన్ని సార్లు రోహిత్‌ శర్మ పైచేయి సాధిస్తే.. మరికొన్ని సార్లు మిచెల్‌ స్టార్క్‌ పైచేయి సాధిస్తాడు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో కూడా ఇండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడిన విషయం తెలిసిందే. సెమీస్‌కు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి.. ఇంటికి పంపింది టీమిండియా. ఆ మ్యాచ్‌ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మిచెల్‌ స్టార్క్‌.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ మ్యాచ్‌లో తాను తప్పు చేశానంటూ పేర్కొన్నాడు.

టీమిండియాతో మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో ఓ ఐదు చెత్త బంతులను వేసి తప్పు చేశాను.. ఆ చెత్త బంతులను రోహిత్‌ శర్మ ఏ మాత్రం కనికరం చూపుకుండా ఐదుకు ఐదు భారీ సిక్సులు బాదేశాడంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు స్టార్క్‌. ఆసీస్‌తో మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ వీరవిహారం చేసిన విషయం తెలిసిందే. 41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సులతో 92 పరుగులు చేసి.. టీమిండియా భారీ స్కోర్‌ అందించాడు. ఆ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ డకౌట్‌ అయినా.. రోహిత్‌ క్రీజ్‌లో పాతుకుపోయి.. ఆసీస్‌ బౌలర్లను చీల్చిచెండాడు. ముఖ్యంగా స్టార్క్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో ఏకంగా నాలుగు సిక్సులు, ఒక ఫోర్‌తో మొత్తం 29 పరుగులు రాబట్టాడు. మరి తన వేసిన చెత్త బంతులను ఏ మాత్రం క్షమించకుండా సిక్సులతో విరుచుకుపడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments