రసవత్తరంగా సాగుతున్న కరేబియన్‌ లీగ్‌! ఇక్కడ లైవ్‌ చూడండి..

టీ20 క్రికెట్‌, ఫ్రాంచైజ్‌ క్రికెట్‌ అంటేనే కరేబియన్‌ క్రికెటర్ల హంగామా. ప్రపంచంలో ఏ మూలన టీ20 లీగ్‌ జరిగినా.. కరేబియన్‌ వీరులే ఎక్కువగా ఉంటారు. దాదాపు ప్రతి లీగ్‌లో ఆడే క్రికెటర్లు ఎవరంటే.. విండీస్‌ ఆటగాళ్లే. టీ20 క్రికెట్‌కు వాళ్లు పెట్టింది పేరు. టీ20 క్రికెట్‌కు కావాల్సిన వేగం, దూకుడు వారి సొంతం. అందుకే ఐపీఎల్‌, లంక ప్రీమియర్‌ లీగ్‌, పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ ఇలా ఏ లీగైనా వాళ్ల హవానే నడుస్తుంది. అలాంటి ఏకంగా వాళ్ల దేశంలోనే టీ20 లీగ్‌ జరిగితే ఇంకేలా ఉంటుంది.. అసలు సిసలైన టీ20 క్రికెట్‌కు నెలవులా ఉంటుంది కదా. ఎస్‌.. కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు అందుకే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. విండీస్‌ క్రికెటర్లతో నిండిపోయే ఆ జట్లు తలపడుతుంటే.. పొట్టి ఫార్మాట్‌కే అందం వస్తుంది. అలాంటి లీగ్‌.. ఈ ఏడాది సీజన్‌ ప్రారంభమైపోయింది.

బుధవారం(ఆగస్ట్‌ 16)తో కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023 సీజన్‌ ప్రారంభమైంది. సెయింట్ లూసియా వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జమైకా తల్లావాస్-సెయింట్ లూసియా కింగ్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌తో ఈ సీజన్‌ షురువైంది. అయితే.. ఐపీఎల్‌తో పాటు భారత క్రికెట్‌ అభిమానులు ఈ కరేబియన్‌ లీగ్‌పై కూడా ఆసక్తి చూపిస్తుంటారు. వెస్టిండీస్‌ క్రికెటర్ల టీ20 విన్యాసాలకు ఫిదా కానీ క్రికెట్‌ అభిమానులు ఉంటారా చెప్పండి. అందుకే.. సీపీఎల్‌ మ్యాచ్‌లను కూడా లైవ్‌ చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఇంట్రస్ట్‌ చూపిస్తారు. అయితే.. మ్యాచ్‌ లైవ్‌ ఏ ఛానెల్‌లో చూడాలి? ఏ టైమ్‌కి మ్యాచ్‌లు వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ లీగ​ సెప్టెంబర్‌ 24 వరకు జరగనుంది. 6 జట్ల మధ్య మొత్తం 34 మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే.. ఒక రోజు ఒకే మ్యాచ్‌ ఉన్నప్పుడు వెస్టిండీస్‌ లోకల్‌ లైమ్‌ రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం అవుతుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 4.30 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. అంటే.. 16వ తేదీ వెస్టిండీస్‌లో రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం అవుతుందంటే.. మన దగ్గర 17వ తేదీ ఉదయం 4.30 గంటకు మ్యాచ్‌ లైవ్‌ వస్తుంది. ఇక ఒకే రోజు రెండు మ్యాచ్‌లు ఉంటే భారత కాల మానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఒక మ్యాచ్‌, ఉదయం 4.30 గంటలకు రెండో మ్యాచ్‌ జరుగుతుంది. ఈ లీగ్‌ లైవ్‌ను ఫ్యాన్‌కోడ్‌ యాప్‌లో చూడవచ్చు. అలాగే అమెరికాలో ఉండే వాళ్లు విల్లో టీవీలో లైవ్‌ చూడొచ్చు. మరి కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: వరల్డ్‌ కప్‌ గెలిచిన కెప్టెన్నే అవమానించిన పాకిస్థాన్‌!

Show comments