లెజెండరీ క్రికెటర్‌ను లెక్కచేయని కోహ్లీ! హర్భజన్‌ బయటపెట్టిన సంచలన విషయం

Harbhajan Singh, Virat Kohli: భారత దిగ్గజ మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ తాజాగా విరాట్‌ కోహ్లీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భజ్జీ చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ కామెంట్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Harbhajan Singh, Virat Kohli: భారత దిగ్గజ మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ తాజాగా విరాట్‌ కోహ్లీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భజ్జీ చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ కామెంట్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గురించి, మరో భారత మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ సంచలన విషయాలు వెల్లడించాడు. హర్భజన్‌-కోహ్లీ కలిసి కొంతకాలం టీమిండియాకు ఆడారు. 2011 వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టులో ఇద్దరూ సభ్యులుగా ఉన్నారు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భజ్జీ తొలిసారి కోహ్లీ గురించి విన్నది, అతని ఆటను చూసిన విషయాల గురించి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

హర్భజన్‌ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్‌ 2008 వేలం కంటే ముందు కోహ్లీ గురించి విన్నాను, అండర్‌ 19లో ఒక మంచి ఆటగాడు ఉన్నాడని నాతో లాల్‌చంద్‌ రాయ్‌పుత్‌ చెప్పారు. మొదటిసారి ముంబై ఇండియన్స్‌-రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్‌ చూశాను. అతను ఆ మ్యాచ్‌లో సనత్‌ జయసూర్య బౌలింగ్‌లో ముందుకొచ్చి భారీ సిక్స్‌ కొట్టాడు. ఆ షాట్‌ చూసి.. ఒక కుర్రాడు, జయసూర్య లాంటి ఒక లెజెండ్‌ అనే బెరుకు లేకుండా భలే కొట్టాడు సిక్స్‌ అని అనుకున్న. అంటే కోహ్లీకి జయసూర్య ఫేస్‌ కనిపించడం లేదు.. కేవలం ఎదురుగా ఒక బౌలర్‌ మాత్రమే కనిపించాడు’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు.

అలా తొలిసారి హర్భజన్‌కు కోహ్లీ ఎవరో తెలిసింది. కోహ్లీ ఆట చూసిన తర్వాత.. ఇండియన్‌ క్రికెట్‌లో నెక్ట్స్‌ బిగ్‌ థింగ్‌ అవుతాడని అనుకున్నట్లు కూడా భజ్జీ తెలిపాడు. అయితే.. ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ టీమిండియాతో లేని విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌ ఆడాల్సిన కోహ్లీ.. వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమయ్యాడు. కోహ్లీ లేకపోయినా కూడా టీమిండియా రెండు, మూడో టెస్టులో విజయం సాధించింది. అయితే.. వీలైనంత త్వరగా కోహ్లీ తిరిగి టీమ్‌లోకి రావాలని భారత క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు. మరి కోహ్లీ గురించి భజ్జీ చెప్పిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments