టీమిండియాదే వరల్డ్‌ కప్‌! రాసిపెట్టుకోండి అంటున్న భారత ప్రముఖ జ్యోతిష్కుడు

ప్రస్తుతం క్రికెట్‌ అభిమానుల దృష్టి మొత్తం వన్డే వరల్డ్‌ కప్‌పైనే ఉంది. క్రికెట్‌ను మతంలా భావించే మన దేశంలో క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఇప్పటికే వరల్డ్‌ కప్‌ ఫీవర్‌ ఎక్కేసిందనే చెప్పాలి. అయితే.. ఈ సారి టీమిండియా కప్పు కొట్టాలని దేశం మొత్తం కోరుకుంటుంది. పైగా ఈ వరల్డ్‌ కప్‌ మన దేశంలోనే జరుగుతుండటంతో 2011 మ్యాజింగ్‌ను టీమిండియా మళ్లీ రిపీట్‌ చేయాలని అంతా కోరుకుంటున్నారు. టీమ్‌ కూడా చాలా పటిష్టంగా ఉండటం, ఆటగాళ్లంతా అద్భుత ఫామ్‌లో ఉండటంతో.. ఈ కప్పు టీమిండియాదే అనే నమ్మకం క్రికెట్‌ అభిమానుల్లో ఏర్పడింది. ఈ నమ్మకాన్ని మరింత పెంచుతూ.. ఇండియాలోనే ప్రముఖ జ్యోతిష్కుడు, సైంటిఫిక్‌ ఆస్ట్రాలజర్‌ గ్రీన్‌స్టోన్‌ లోబో సైతం ఈ సారి కప్పు టీమిండియాదే అని చెప్పడం విశేషం.

గ్రీన్‌ స్టోన్‌ లోబో.. జోతిష్యాన్ని నమ్మేవారికి పరిచయం అక్కర్లేని పేరు. దేశవ్యాప్తంగా చాలా మందికి గ్రీన్‌ స్టోన్‌ లోబో సుపరిచితమే. గతంలో అనేకసార్లు ఆయన చెప్పింది చెప్పినట్లు జరగడంతో ఆయనకు ఇంతలా పేరొచ్చింది. తాజాగా ఆయన భారత్‌లో త్వరలో జరగనున్న వన్డే వరల్డ్‌ కప్‌ను గెలిచే కెప్టెన్‌ ఎవరో చెప్పేశాడు. 1987లో జన్మించిన కెప్టెన్ భారత్‌లో జరగనున్న పురుషుల వన్డే ప్రపంచకప్‌ను గెలుస్తాడని జోస్యం చెప్పాడు. 1987లో జన్మించిన క్రీడాకారులు, కెప్టెన్లు ఇటీవల ప్రధాన క్రీడా ఈవెంట్‌లలో విజయం సాధించారని, దీంతో క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లోనూ అదే జరుగుతుందని అన్నాడు.

2022లో జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ను అర్జెంటీనా కెప్టెన్‌ లియోనెల్ మెస్సీ నేతృత్వంలో గెలుచుకున్న విషయం తెలిసిందే. మెస్సీ కూడా 1987లోనే పుట్టాడు. ఇప్పుడు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పుట్టిన ఏడాది కూడా 1987 కావడంతో.. ఈ సారి వరల్డ్‌ కప్‌ రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని టీమిండియానే గెలుస్తుందని అంటున్నాడు. ఇప్పుడే కాదు.. గతంలో జరిగిన మూడు వరల్డ్‌ కప్పుల్లోనూ గ్రీన్‌ స్టోన్‌ లోబో చెప్పిన జ్యోతిష్కం అక్షర సత్యమైంది. 2011లో కూడా టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలుస్తుందని లోబో చెప్పాడు. అలాగే 2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లండ్‌ జట్లు వరల్డ్‌ కప్‌ గెలుస్తాయని చెప్పాడు. 2019లో ఇంగ్లండ్ ప్రపంచ కప్ గెలిచినప్పుడు ఇయాన్ మోర్గాన్ పుట్టిన ఏడాది ఆధారంగానే విజేతను అంచనా వేశాడు లోబో. తాజాగా 1987 సంవత్సరంలో జన్మించిన కెప్టెన్ 2023 క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుస్తాడని అతను అంచనా వేసాడు. మరి 1987లో పుట్టిన రోహిత్‌ శర్మ వరల్డ్‌ ‍కప్‌ ఎత్తనున్నాడన్న మాట. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: తొలి సెంచరీతోనే గిల్, రైనా రికార్డ్ బ్రేక్ చేసిన జైస్వాల్! ఆ లిస్ట్ లో అగ్రస్థానం..

Show comments