iDreamPost

తొలి సెంచరీతోనే గిల్, రైనా రికార్డ్ బ్రేక్ చేసిన జైస్వాల్! ఆ లిస్ట్ లో అగ్రస్థానం..

  • Author Soma Sekhar Published - 02:22 PM, Tue - 3 October 23
  • Author Soma Sekhar Published - 02:22 PM, Tue - 3 October 23
తొలి సెంచరీతోనే గిల్, రైనా రికార్డ్ బ్రేక్ చేసిన జైస్వాల్! ఆ లిస్ట్ లో అగ్రస్థానం..

ఏషియన్ గేమ్స్ లో టీమిండియా సెమీస్ కు దూసుకెళ్లింది. తాజాగా నేపాల్ తో జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో 23 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. ఈ విజయంలో యువ సంచలనం యశస్వీ జైస్వాల్ కీలక పాత్ర పోషించాడు. సునామీ శతకంతో చెలరేగిన జైస్వాల్.. నేపాల్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్ లో తొలి టీ20 సెంచరీని నమోదు చేశాడు. ఇక ఈ శతకంతో గిల్, రైనాల రికార్డులను బ్రేక్ చేశాడు ఈ చిచ్చర పిడుగు.

యశస్వీ జైస్వాల్.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపాడు. అద్భుతమైన ఆటతీరుతో టీమిండియాలోకి దూసుకొచ్చాడు ఈ యువ కెరటం. తాజాగా ఏషియన్ గేమ్స్ లో భాగంగా నేపాల్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో మెరుపు సెంచరీతో ఆకట్టుకున్నాడు. కేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. కాగా.. ఇంటర్నేషనల్ టీ20ల్లో అతడికి ఇది తొలి శతకం కాగా.. భారత్ తరఫున 5వ వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలోనే తొలి సెంచరీతోనే టీమిండియా స్టార్ ఆటగాడు శుబ్ మన్ గిల్, మాజీ ఆటగాడు సురేష్ రైనాల రికార్డులను బ్రేక్ చేశాడు.

టీమిండియా తరఫున టీ20 శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా జైస్వాల్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు శుబ్ మన్ గిల్ పేరిట ఉండేది. అతడు 23 ఏళ్ల 146 రోజుల వయసులో సెంచరీ సాధించాడు. తాజాగా యశస్వీ ఈ సెంచరీతో గిల్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. అతడు 21 ఏళ్ల 279 రోజుల వయసులోనే ఈ ఫీట్ సాధించాడు. రైనా కూడా 23 ఏళ్ల 156 రోజుల వయసులో సెంచరీ సాధించి భారత్ తరపున సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా లిస్ట్ లో మూడో స్థానంలో ఉన్నాడు. మరి ఒకే ఒక్క సెంచరీతో రికార్డ్ లు బ్రేక్ చేసిన యశస్వీ జైస్వాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి