IND vs ENG: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు గుడ్‌న్యూస్‌! ఇంగ్లండ్‌కు డేంజర్‌!

India vs England, Vizag: తొలి టెస్టు ఓడిపోయి.. బాధలో ఉన్న టీమిండియాకు రెండో టెస్టు మంది మంచి ఎనర్జీ ఇచ్చే ఒక విషయం ఇది. తొలి టెస్టులో ఓడినా.. రెండో టెస్టు గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తున్న టీమిండియా గుడ్‌ న్యూస్‌. అదేంటో ఇప్పుడు చూద్దాం..

India vs England, Vizag: తొలి టెస్టు ఓడిపోయి.. బాధలో ఉన్న టీమిండియాకు రెండో టెస్టు మంది మంచి ఎనర్జీ ఇచ్చే ఒక విషయం ఇది. తొలి టెస్టులో ఓడినా.. రెండో టెస్టు గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తున్న టీమిండియా గుడ్‌ న్యూస్‌. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 2 నుంచి భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య రెండో టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో గల డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. కచ్చితంగా తెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో ఓటమి పాలై.. టీమిండియా అందరికి షాకిచ్చింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి ఇంగ్లండ్‌ను డామినేట్‌ చేసిన భారత్‌.. చివర్లో మ్యాచ్‌పై పట్టు జారవిడుస్తూ వెళ్లింది. ఇంగ్లండ్‌ ఆటగాడు ఓలీ పోప్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఆడి భారీ స్కోర్‌ చేయడం, టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో మన బ్యాటర్లు చేతులెత్తేయడం, ఇంగ్లండ్‌ బౌలర్లు చెలరేగడంతో రోహిత్‌ సేన 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

కానీ, విశాఖపట్నం వేదికగా జరిగే రెండో టెస్టులో అయితే.. కచ్చితంగా గెలిచి తీరాలని రోహిత్‌ సేన వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియాకు ఒక శుభవార్తలా.. ఒక విషయం అనుకూలంగా ఉంది. అదేంటంటే.. రెండో టస్టు జరగబోయే వైజాగ్‌లో టీమిండియా ఇప్పటి వరకు టెస్టు మ్యాచ్‌ ఓడిపోలేదు. 2016లో వైజాగ్‌లో తొలిసారి టెస్టు మ్యాచ్‌ ఆడిన టీమిండియా.. ఇదే ఇంగ్లండ్‌పై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 246 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం సాధించింది. అలాగే 2019లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ టీమిండియా 203 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. ఇలా రెండు పెద్ద టీమ్స్‌తో ఈ వేదికపై తలపడిన భారత జట్టు.. రెండు సార్లు కూడా రెండు వందలకు పైగా మార్జిన్‌తో గెలవడం విశేషం. ఇప్పుడే ఇదే టీమిండియాకు సానుకూలంగా ఉన్న అంశం. ఇప్పటికే తొలి టెస్టు మ్యాచ్‌ ఓడిపోయిన బాధలో ఉన్న టీమిండియాకు.. తమకు బాగా అచ్చొచ్చిన మైదానంలో రెండో టెస్ట జరగనుండటం కలిసొచ్చే అంశం.

ఇలా రెండో టెస్టు కోసం టీమిండియా పాజిటివ్‌ ఎనర్జీ ఇచ్చే విషయం తెలిసినా.. ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు గాయాలతో దూరం కావడం రోహిత్‌ సేనను కలవరపెడుతోంది. తొలి టెస్టులో మంచి ప్రదర్శన కనబర్చిన రవీంద్ర జడేజా, కేఎల్‌ రాహుల్‌.. గాయాలతో రెండో టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. వీరిద్దరూ తొలి టెస్టులో హాఫ్‌ సెంచరీలతో రాణించారు. జడేజా అయితే ఇటు బ్యాటింగ్‌, అటు బౌలింగ్‌లోనూ మంచి ప్రరద్శన కనబర్చాడు. పైగా జట్టులో ఉన్న ఆటగాళ్లలో శుబ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ చెత్త ఫామ్‌లో ఉన్నారు. అలాగే సీనియర్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ కూడా టీమ్‌లో లేడు. ఇలా రెండో టెస్టుకి ముందు టీమిండియా చాలా లోపాలతో బరిలోకి దిగుతోంది. కానీ, ఓటమి ఎరుగని గ్రౌండ్‌లో మ్యాచ్‌ ఉండటం ఒక్కటే టీమిండియా కలిసొచ్చే అంశం. మరి అచ్చొచ్చిన మైదానం టీమిండియాకు విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments